వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టార్ట్... యాక్షన్... కెమెరా... అంటున్నవారిని ఇంటికి పంపిస్తున్న తెలుగుదేశం?

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీలో స‌రికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భ‌విష్య‌త్తులో పార్టీకి మేలు చేసేలా ఈ మార్పులు ఉంటున్నాయ‌ని పార్టీ నేత‌లు వెల్ల‌డిస్తున్నారు. అధినేత చుట్టూ చేరి పొగిడి సీటు సంపాదించుకోవ‌డం.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు డ‌బ్బులు ఖ‌ర్చుపెట్ట‌కుండా యాక్ష‌న్ చేసేవారిని, మాట‌లు చెప్పేవారిని నిర్ధాక్షిణ్యంగా బ‌య‌ట‌కు పంపించివేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 బ‌ల‌మైన అభ్య‌ర్థుల కోసం వేట‌

బ‌ల‌మైన అభ్య‌ర్థుల కోసం వేట‌

రాబోయే ఎన్నిక‌ల్లో తీవ్ర ప్ర‌భావం చూపేది ఆర్థిక వ‌న‌రులేన‌ని టీడీపీ బ‌లంగా న‌మ్ముతోంది. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయినా, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం అయినా నియోజ‌క‌వ‌ర్గాల్లోని అభ్య‌ర్థులు ఎవ‌రు ఆర్థికంగా బ‌ల‌వంతులైతే వారిదే గెలుపు అనే సూత్రాన్ని న‌మ్మ‌తున్నాయి. దీంతో బ‌ల‌మైన అభ్య‌ర్థుల కోసం ఇప్ప‌టినుంచే వేట జ‌రుగుతోంది. వైసీపీ అధిష్టానం మాత్రం స‌ర్వేలో మంచి మార్కులు వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు ఆర్థికంగా వ‌న‌రులు స‌మ‌కూర్చాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

 గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌కొట్టిన బీజేపీ

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌కొట్టిన బీజేపీ


గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ ఆర్థిక‌మూలాల‌ను బీజేపీ దెబ్బ కొట్టింది. ఐటీ, ఈడీ దాడుల‌తో పార్టీ అభ్య‌ర్థుల‌కు స‌ర‌ఫ‌రా అవ్వాల్సిన న‌గ‌దు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయింది. ఇది పార్టీ గెలుపోట‌ముల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌నేది టీడీపీ న‌మ్మ‌కం. ఈసారి కూడా అటువంటి ప‌రిస్థితి ఎదురుకాద‌నే న‌మ్మ‌కం లేదు. అందుకే నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీకి నిలిచే అభ్య‌ర్థులు ఆర్థికంగా బ‌లోపేత‌మై అంగ‌బ‌లం ఉన్న‌వారైతేనే రాబోయే ఎన్నిక‌ల‌ను త‌ట్టుకోగ‌ల‌ర‌ని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది.

 సీట్ల కేటాయింపుపై హామీనివ్వ‌ని చంద్ర‌బాబునాయ‌డు

సీట్ల కేటాయింపుపై హామీనివ్వ‌ని చంద్ర‌బాబునాయ‌డు

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై ఉన్న కేసుల గురించి కూడా ప్ర‌ధాన‌మంత్రి మౌనంగా ఉండ‌టం వైసీపీకి క‌లిసివ‌స్తోంద‌ని, వైసీపీకి బీజేపీ ప‌రోక్షంగా మ‌ద్ద‌తిస్తోంద‌ని టీడీపీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌న‌సేన‌తో పొత్తుపై ఇంత‌వ‌ర‌కు స్ప‌ష్ట‌త లేదు. ఉంటే ఒక‌వేళ ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కు కూడా స‌ర్దుబాటు చేయాల్సి రావ‌చ్చ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సాధ్య‌మైనంత‌వ‌ర‌కు జ‌న‌సేన పార్టీ కూడా ఆర్థికంగా బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌నే నిల‌బెడుతుంద‌ని భావిస్తున్నారు. ఒంగోలులో మ‌హానాడు జ‌రిగిన స‌మ‌యంలో ప‌లువురు నేత‌లు చంద్ర‌బాబునాయుడు, లోకేష్ ను క‌లిసి సీటు కేటాయించే విష‌య‌మై ఒత్తిడి చేసిన‌ప్ప‌టికీ వారికి ఎటువంటి హామీనివ్వ‌లేదు. ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడ‌క త‌ప్ప‌దు..!!

English summary
Telugu Desam is sending home the leaders who are limited to words without hands
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X