అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమాషాగా ఉందా.. చివరి నిముషంలోనైనా మార్చేస్తా?

|
Google Oneindia TeluguNews

రానున్న ఎన్నికల కోసం బాగా కష్టపడితే విజయం సాధించడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయని, ప్రజల స్పందన కూడా ఊహించని రీతిలో ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు చెబుతున్నారు. నియోజకవర్గాల సమీక్షలు జరుగుతున్న సమయంతోపాటు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో కూడా తమ్ముళ్లకు అంతర్గతంగా ఆయన అదే చెబుతున్నారు.

చంద్రబాబు మాట పెడచెవిన పెడుతున్నారు..

చంద్రబాబు మాట పెడచెవిన పెడుతున్నారు..

ఎన్నికల సమయానికి మాత్రమే యాక్టివ్ అయ్యేవారు టీడీపీలో ఎక్కువ. ఇప్పుడు ఆ పార్టీకి అదే నష్టం చేకూరుస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమే ఉన్నప్పటికీ ఎక్కువమంది ఇన్ఛార్జిలు ప్రజలతో మమేకమవడంలేదు. ఆర్థిక బలం, అంగబలం రెండూ ఉన్నవారు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. ప్రచారం విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నా అలసత్వాన్ని దరిచేయరనీయవద్దని బాబు పదే పదే చెబుతున్నప్పటికీ తమ్ముళ్లు పెడచెవిన పెడుతున్నారు. జనసేనతో పొత్తుంటుందని, అలాగే చివరి నిముషంలో బీజేపీతో పొత్తు కుదిరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, ఏ నియోజకవర్గం ఏ పార్టీకి కేటాయిస్తారో స్పష్టత రావడంలేదని చాలామంది ఇన్ ఛార్జిలు ప్రచారంతోపాటు నియోజకవర్గ ఖర్చులను కూడా తగ్గించారు.

40 శాతం టికెట్లు యువతకే..

40 శాతం టికెట్లు యువతకే..

గత మూడున్నర, నాలుగు సంవత్సరాలుగా యాక్టివ్ కాని నాయకులకు చంద్రబాబు ఓర్పుగా చెప్పిచూస్తున్నారు. ఈసారి 40 శాతం టికెట్లు యువతకు ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి తాను చేయించుకున్న సర్వే ప్రకారం గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇచ్చి, యాక్టివ్ కాని నాయకుల స్థానాల్లో యువతను ప్రోత్సహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలో చురుగ్గా పాల్గొని, పర్యటన యుగియగానే ఎవరిదారిని వారుపోయే ఇన్ ఛార్జిలను మార్చాలనుకుంటున్నట్లు సమాచారం.

చివరి నిముషంలోనైనా సీటు మారుస్తా?

చివరి నిముషంలోనైనా సీటు మారుస్తా?


ఇప్పటినుంచే ఖర్చు పెట్టడం ఎందుకు? సీటు ఉంటుందా? ఉంటే తనకే ఇస్తారా? పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారా? ఇలాంటి సందేహాల మధ్య నలుగుతున్న నియోజకవర్గ ఇన్ఛార్జిలు పనితీరు విషయంలో కూడా అలాగే ఉంటున్నారు. నాయకులంతా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నివేదికలు తెలపడంతో వారందరికీ లోకేష్ చేస్తున్న పాదయాత్ర యువగళం బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి నుంచి ఎన్నికలు జరిగేవరకు కచ్చితంగా ప్రజల్లో ఉండాల్సిందేనని, లేదంటే చివరి నిముషంలో కూడా సీటు మార్చేస్తానని వారిని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

English summary
Telugu Desam Party chief Chandrababu Naidu is telling the party leaders that if they work hard for the upcoming elections, there are good chances of winning and forming the government, and the response of the people is also unexpected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X