'23'ను బద్ధలు కొట్టిన తెలుగుదేశం!
తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం అంటేనే రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ సెంటిమెంటు ఉంటుంది. గ్రహాల ప్రభావం తొలగిపోతుందని, శుక్రుడు, బుధుడు రాశుల్లోకి ప్రవేశించడంవల్ల అంతా అనుకూలంగా జరుగుతుందని, ఆరోజు నుంచి జాతకం మారిపోతుందనే నమ్మకంతో ఉంటారు.
తెలుగుదేశం పార్టీకి 23 సంఖ్య అచ్చిరాలేదని మొన్నటివరకు రాజకీయ విశ్లేషకులు ఒక లెక్క చెప్పేవారు. దీనికి కారణం.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 23 ఎమ్మెల్యేలే గెలవడం. అంతకుముందు అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేల సంఖ్య 23.
పద్మశాలి వర్గానికి చెందిన @AnuradhaTdp ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో గ్రామాలతో సహా మంగళగిరి నియోజకవర్గం అంతటా చేనేత కార్మికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. చేనేత వర్గానికి టిడిపి ఇచ్చిన గౌరవం అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.#ByeByeJaganIn2024 pic.twitter.com/c9MVe2zCD3
— Telugu Desam Party (@JaiTDP) March 23, 2023
అయితే ఉగాది తర్వాతరోజు నుంచే గ్రహాల ప్రభావంవల్ల తెలుగుదేశం పార్టీ జాతకం మాత్రం మారిపోయిందని రాజకీయ పంచాంగకర్తలు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించారు.
23వ తేదీనే ఎన్నిక జరగడం, బలం లేకపోయినప్పటికీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవడం జరిగింది కూడా 23వ తేదీనే అవడం విశేషం. పంచాంగ శ్రవణం చేసి 24 గంటలు కూడా కాకముందే అధికార పార్టీకి వ్యతిరేకంగా, ప్రతిపక్షానికి అనుకూలంగా ఎమ్మెల్సీ ఫలితం వచ్చింది. పంచాంగం చెప్పివారు మాత్రం ఎవరికి కావల్సినరీతిలో వారు చెప్పారు.

తెలుగు తమ్ముళ్లు మాత్రం సెంటిమెంట్ ను బ్రేక్ చేశామని, ఉదాహరణగా ఇంతకంటే ఏం కావాలంటున్నారు. సెంటిమెంట్లు అనేవి తాత్కాలికమేనని, చంద్రబాబునాయుడిపై ప్రజలకు ఉన్న నమ్మకమే శాశ్వతమని, మొన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలతోపాటు తాజాగా పంచుమర్తి అనురాధను గెలిపించుకోవడం తమ అధినేత చంద్రబాబు చాణక్యమని, ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు అవసరం అనేది ఈ ఎన్నికతో మరోసారి నిరూపితమైందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications