వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు తగ్గారు, ఏపీని కబళించాలని చూస్తే: మోడీకి జేసీ హెచ్చరిక, 'జగన్ రాజీనామా చేయిస్తే అంతే'

|
Google Oneindia TeluguNews

Recommended Video

JC Diwakar Reddy Warns PM modi

అమరావతి: సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోలవరం ప్రాజెక్టు ఆపాలన్న కేంద్రం లేఖపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ ఆకలితో ఉందని, ఆంధ్రప్రదేశ్‌ను కబలించాలని చూస్తోందని ధ్వజమెత్తారు.

చిరంజీవే పవన్ కళ్యాణ్‌కు శాపం, బాబు కరుణ: జేసీ సంచలనం, వైసీపీ నేత చేరికపై షాక్చిరంజీవే పవన్ కళ్యాణ్‌కు శాపం, బాబు కరుణ: జేసీ సంచలనం, వైసీపీ నేత చేరికపై షాక్

ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించాలని చూస్తోందని, దక్షిణాదిలో తమిళనాడుపై ఇటీవల కుయుక్తులు పన్నుతోందని, అలాగే ఏపీని కూడా కబళించాలని అనుకుంటోందని ధ్వజమెత్తారు.

 చంద్రబాబును నియంత్రించాలనే

చంద్రబాబును నియంత్రించాలనే

ఏపీని కబళించాలనే ఉద్దేశ్యంతోనే అనవసర సమస్యలు సృష్టిస్తోందని విమర్శించారు. కేంద్రం చర్యలపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని జేసీ వ్యాఖ్యానించారు. చంద్రబాబును నియంత్రించాలనే ఒక దుర్బుద్ధి ఉందని తమకు అనుమానంగా ఉందని చెప్పారు. పోలవరం విషయంలో చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకొని కేంద్రం చుట్టూ తిరుగుతున్నారన్నారు.

 కేంద్రం ఏపీపై చిన్నచూపు

కేంద్రం ఏపీపై చిన్నచూపు

రాష్ట్ర అవసరాల కోసం చంద్రబాబు ఓ మెట్టు తగ్గినా కేంద్రం మాత్రం చిన్నచూపు చూస్తోందని జేసీ వాపోయారు. ఇది వాళ్ల జాగీర్దారు కాదని, మేం వాళ్లకు బానిసలం కాదని స్పష్టం చేశారు. ఏవైనా అనుమానాలు ఉంటే అడిగి తెలుసుకోవాలని, టెండర్లు ఆపమని చెప్పడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

 మోడీకి హెచ్చరిక

మోడీకి హెచ్చరిక

పోలవరం ఆపితే దేశంలో అతిపెద్ద తిరుగుబాటు తలెత్తే అవకాశముందని జేసీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాంటివి జరిగేలా కేంద్రం వ్యవహరించదనే తాము ఇప్పటికీ నమ్ముతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సృష్టిస్తున్న ప్రతిబంధకాలు పరిపాలనాపరమైనవి కాకపోవచ్చునని రాజకీయ కారణాలు ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.

 ఏపీతో వైరం పెట్టుకోవాలనుకుంటే మీకే మూడుతుంది

ఏపీతో వైరం పెట్టుకోవాలనుకుంటే మీకే మూడుతుంది

ఆంధ్రప్రదేశ్‌తో కేంద్రం వైరం పెట్టుకోవాలనుకుంటే చివరికి వారికే నష్టం వాటిల్లితుందని జేసీ అన్నారు. డిసెంబరు 15 నుంచి పార్లమెంటు సమావేశాలున్నాయని, ఈలోపు దీనిని సరిదిద్దాలని కోరారు. తాను టీడీపీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని, కానీ అవసరమైతే పోలవరంపై వ్యక్తిగతంగానైనా నిరసన తెలియజేస్తానన్నారు.

 ఢిల్లీకి బీజేపీ నేతలు

ఢిల్లీకి బీజేపీ నేతలు

కాగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చూసేందుకు రాష్ట్ర బీజేపీ నాయకుల బృందం గుజరాత్‌ ఎన్నికలయ్యాక ఢిల్లీకి వెళ్లనుంది. కేంద్ర పెద్దల్ని కలవనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, ఇతరత్రా ఇచ్చిన హామీలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులపై శాసనసభలో గురువారం ప్రత్యేక చర్చ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై సభలో మాట్లాడే ముందుగా బీజేపీకి చెందిన మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు, శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌లను తన కార్యాలయానికి ఆహ్వానించి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

 ప్యాకేజీకి అంగీకరించినా లాభం లేదు

ప్యాకేజీకి అంగీకరించినా లాభం లేదు

చంద్రబాబుతో జరిగిన భేటీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల్ని ముఖ్యమంత్రి ఏకరవు పెట్టారు. విభజన చట్టం హామీలు అమలుకాకపోవటాన్ని వివరించారు. ఇలాగైతే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తాను ప్యాకేజీకి అంగీకరించినా ఉపయోగం లేకపోతోందన్నారు.

 జగన్ ఎంపీలతో రాజీనామా చేయిస్తే

జగన్ ఎంపీలతో రాజీనామా చేయిస్తే

ప్రత్యేక హోదా సాధనకి పార్టీ ఎంపీలతో వైసీపీ అధినేత జగన్‌ రాజీనామా చేయించటానికి ధైర్యం చేయలేకపోయారని, ఒకవేళ అలా రాజీనామా చేయిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో గుర్తించాలని చంద్రబాబు.. బీజేపీ నేతలకు సూచించారు. హామీలు అమలుకాకపోగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పదేపదే అడ్డంకులు సృష్టిస్తుంటే తాను ప్రజలకేం సమాధానం చెబుతానని ప్రస్తావించారు. ఢిల్లీకి వెళ్లి మీ వంతుగా కేంద్ర పెద్దల్ని కలిసి పోలవరం పనులు సాఫీగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. దీనికి భాజపా నేతలు అంగీకరించారు.

English summary
Telugu Desam Party MP JC Diwakar Reddy Make Sensational Comments on Centre over Polavaram Project on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X