అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 'మిస్ ఫైర్?'

|
Google Oneindia TeluguNews

అక్షరాలు దొరక్కపోతే భావ దారిద్ర్యం అంటారు. అభ్యర్థులు దొరక్కపోతే ఏ దారిద్ర్యం అంటారో రాజకీయవేత్తలకే తెలియాలి. గుడివాడ నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. దీనికి కారణం మాజీ మంత్రి కొడాలి నాని. తన వ్యాఖ్యలతో ఆయన రాజకీయ రచ్చ చేస్తుంటారు. మంత్రిగా ఉన్న సమయంలోను, లేనప్పుడు కూడా అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై విరుచుకుపడుతుంటారు. దీంతో ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గుడివాడ నియోజకవర్గం ఫస్ట్ టార్గెట్ గా నిలిచింది.

 అభ్యర్థిని తేల్చలేకపోతున్న చంద్రబాబు

అభ్యర్థిని తేల్చలేకపోతున్న చంద్రబాబు


అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్న పరిస్థితులకు గుడివాడ నియోజకవర్గం దర్పణంగా నిలుస్తుంది. అధినేత చంద్రబాబు కూడా ఇక్కడ అభ్యర్థి ఎవరో తేల్చకుండా నాన్చుడు బేరాలు చేస్తున్నారు. గతానికి భిన్నంగా దూకుడుగా పనిచేస్తున్నానని, అభ్యర్థులను ఏడాదిన్నర ముందుగానే ఎంపిక చేస్తున్నానని చెప్పే చంద్రబాబు గుడివాడలో ఎవరిచేత పోటీచేయించాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు.

 ఎన్నో పేర్లు.. మరెన్నో మ్యాజిక్స్

ఎన్నో పేర్లు.. మరెన్నో మ్యాజిక్స్


నందమూరి కుటుంబం నుంచి సుహాసినీకానీ, మరొకరుకానీ పోటీచేస్తారంటూ ప్రచారం జరుగుతుండగానే కాదు కాదు.. వంగవీటి రాధా ఈసారి గుడివాడ నుంచి బరిలోకి దిగుతున్నారనే వార్త వస్తుంది. పార్టీ ఇన్ ఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావుకే సీటు ఖరారైందని చెబుతారు. అది పూర్తిగా తెలుసుకునేలోగానే యువ నాయకుడు శిష్ట్లా లోహిత్ కు సీటు ఖాయమైందంటారు. అటు తర్వాత పిన్నమనేని బాబ్జీ రంగంలోకి దిగుతున్నాడంటారు. తూచ్... వీరంతా కాదు.. మాజీ మంత్రి దేవినేని ఉమ గుడివాడ నుంచి పోటీ అంటూ వార్త చక్కర్లు కొడుతుంది. తాజాగా ఒక ఎన్నారై పోటీకి దిగుతున్నారంటున్నారు.

ఎవరిని నిలబెడతారో? ఏమిటో?

ఎవరిని నిలబెడతారో? ఏమిటో?


కొడాలి నానిని ఓడించాలని అనుకున్నప్పుడు దానికి కనీసం రెండు సంవత్సరాల ముందుగానే ఒక వ్యూహాన్ని రూపొందించుకోవాలి. అభ్యర్థిని ఫైనల్ చేసుకొని నియోజకవర్గంలో పర్యటించేలా చేయాలి. సీటు ఆశించినవారు, అసమ్మతులు ఉంటే ముందుగా తెలిసిపోతుంది. అందుకు తగ్గట్లుగా వ్యూహాన్నిరూపొందించుకొని నియోజకవర్గంలో పనిచేసుకుంటే సరిపోతుంది. అభ్యర్థి మీదే ఇన్నిరకాల వార్తలు, ఇంతమంది వ్యక్తుల పేర్లు తెరమీదకు వస్తున్న సమయంలో అధినాయకత్వం జోక్యం చేసుకొని ఒకరి పేరు ను ఖరారుచేసి చావో రేవో తేల్చుకోమని చెబితే అందరూ అంగీకరిస్తారు. కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబునాయుడు తన సహజ ధోరణి ప్రకారం అభ్యర్థి విషయంలో తర్జన భర్జనలు పడుతున్నారు. చివరకు ఎవరిని నిలబెడతారో? ఏమిటో? అంటూ తెలుగు తమ్ముళ్లు నిట్టూర్పులు విడుస్తున్నారు.

English summary
If the letters are not found, it is called Bhava Pāridryam.Politicians should know what poverty is if candidates are not found.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X