చంద్రబాబు షాక్: జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ఔట్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులకు షాక్ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పూర్తి చేస్తున్నారు ఆస్పత్రుల కమిటీల బోర్డుల్లోకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు రాకుండా చూసేందుకు ఎత్తుగడ వేశారు.

జగన్ పార్టీ ఎమ్మెల్యేలను ఆస్పత్రుల కమిటీలకు సంబంధించిన బోర్డుల్లోకి రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ ప్రస్తుత నిబంధనలను మార్చేస్తోంది. అందుకు సంబంధించిన ప్రతిపాదలను చంద్రబాబుకు పంపించింది. త్వరలో తాజా ఆదేశాలు వచ్చే ఆవకాశాలున్నాయి. ఈ మేరకు సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,175 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 193 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 30 ఏరియా ఆస్పత్రులు, 15 జిల్లా స్థాయి ఆస్పత్రులు ఉన్నాయి. పిహెచ్‌సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులకు సంబంధించిన ప్యానెల్స్‌కు స్థానిక శాసనసభ్యుడు చైర్ పర్సన్ వ్యవహరించే నిబంధన ఉంది. ప్రస్తుతం దాదాపు 60 మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులున్నారు.

Telugu Desam to put YSRC MLAs out

స్థానిక ఎమ్మెల్యేలను ఆస్పత్రుల కమిటీ ప్యానెల్ చైర్ పర్సన్‌గా నియమిస్తే దాదాపు 60 మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఆ గౌరవాన్ని దక్కించుకుంటారు. వారు చైర్ పర్సన్లుగా వస్తే తమకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మొత్తం నిబంధనలను మర్చేసేందుకు నడుం బిగించినట్లు చెబుతున్నారు. అనధికారులను చైర్ పర్సన్‌గా నియమించేందుకు వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలను మారుస్తున్నట్లు సమాచారం.

దీంతో తనకు ఇష్టమైన వారిని చైర్ పర్సన్‌గా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది. దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుల బెడదను తగ్గించుకోవచ్చునని తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దానికితోడు, వేలాది మంది బిజెపి, టిడిపి నాయకులకు, కార్యకర్తలకు పదవులు కల్పించే అవకాశం కూడా దక్కుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+