ఎంతసేపటికీ మామీద పడి ఏడవడమే!
తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం గొప్ప స్థితిలో కొనసాగుతోంది. బాహుబలితో సినిమా గతిని రాజమౌళి మార్చేయడంతోపాటు ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. రాజమౌళి నిర్మించిన రహదారిలో సుకుమార్ ప్రయాణం చేస్తూ పుష్ప సినిమాతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మొట్టమొదటిసారిగా ఒక తెలుగు కథానాయకుడిగా జాతీయ అవార్డు దక్కింది. దీన్నిబట్టి తెలుగు సినిమా ఎటువంటి స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కరోనా వచ్చిన తర్వాత దేశంలోని అన్ని సినీ పరిశ్రమలకన్నా ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది తెలుగు పరిశ్రమే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే. సలార్, ఓజీ, పుష్ప2, గేమ్ ఛేంజర్, దేవర, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.

ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమ కూడా ఇదే స్థాయిలో ఉండేది. వెట్రిమారన్, మణిరత్నం, శంకర్ లాంటి దర్శకులు జాతీయ స్థాయిలో సినిమాలు తీసేవారు. శంకర్ డౌనవడం, మాణిరత్నం గతంలోలా సినిమాలు తీయలేకపోతుండటంతోపాటు వెట్రి మారన్ విడుదలై చిత్రం కోసం ఎక్కువ గ్యాప్ తీసుకోవడంతో తమిళ సినీ పరిశ్రమ నుంచి మంచి సినిమాలు రావడంలేదు.
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ అంతా కమర్షియల్ బాట పట్టారు. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకు మెసేజ్ అద్దేవారు. ఇప్పుడు లేదు. హీరోయిజం ఎలివేట్ చేసే సినిమాలు చేస్తున్నారు. కొవిడ్ సమయంలో కూడా కోలీవుడ్ నుంచి జై భీమ్, సార్పట్ట పరంబర్తె లాంటి సినిమాలు వచ్చాయి. వీటన్నింటినీ గమనించకుండా తెలుగు సినిమాలకు అవార్డులు ఎక్కువగా ఇచ్చారు.. మాకు మొండిచెయ్యి చూపించారంటూ తమిళ పరిశ్రమ మేధావులు తెలుగు హీరోలపై పడి ఏడుస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని గమనిస్తే వారికే మంచిది. లేకపోతే ఏడిచింది ఏడిచినట్లుగా ఉంటుంది.












Click it and Unblock the Notifications