గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sirisha Bandla సక్సెస్ స్టోరీ: నాడు కంటిచూపులేక రిజెక్ట్ - నేడు మువ్వన్నెల బ్యాడ్జితో సగర్వంగా..!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

వినువీధిలో తెలుగు తేజం. భుజాన జాతీయ జెండా బ్యాడ్జి ధరించి..కొండత ఆత్మ విశ్వాసంతో అంతరిక్షంలో విహరించారు. అంతరిక్ష యాత్రకు వెళ్లిన నాలుగో ఇండియన్‌గా చరిత్ర సృష్టించారు. తెలుగు బిడ్డ సాధించిన ఈ విజయంతో తెలుగు రాష్ట్రాలోనే కాదు..జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు శిరీష బండ్ల స్పూర్తిదాయక మహిళగా మారిపోయారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. తెలుగమ్మాయి శిరీష బండ్ల (34).. ఆస్ట్రోనాట్‌ 004గా అంతరిక్షపు అంచుల దాకా వెళ్లొచ్చారు. ఆ ఘనత సాధించిన భారత మహిళలు కల్పనా చావ్లా, సునీత విలియమ్స్‌ సరసన నిలిచారు. తన భుజాన త్రివర్ణ పతాక రంగులోని బ్యాడ్జ్ ధరించి గగనాన భారతీయతను సగర్వంగా చాటిన మహిళగా రికార్డు సాధించారు.

Recommended Video

Sirisha Bandla సక్సెస్ స్టోరీ.. నాడు కంటిచూపులేక రిజెక్ట్ - నేడు మువ్వన్నెల బ్యాడ్జితో సగర్వంగా..!
 శిరీష చిన్న నాటి కల

శిరీష చిన్న నాటి కల

పెద్దయిన తరువాత వ్యోమగామిగా అంతరిక్షంలోకి దూసుకుపోవాలి అనేది శిరీషా చిన్ననాటి కల. నాసాలో వ్యోమగామి కావాలనేది జీవిత లక్ష్యం. అయితే, శిరీషా కంటిచూపు సరిగ్గా లేకపోవటంతో ఆ అవకాశాన్ని అందుకోలేకపోయారు. అయినా..శిరీష ఎక్కడా నిరాశకు గురి కాలేదు. తన లక్ష్యాన్ని వీడలేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా అంతరిక్ష యాత్ర చేసారు. గుంటూరు జిల్లా తెనాలి లో జన్మించిన శిరీషా నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు.

నాసాలో వ్యోమగామిగా...

పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఆమె ఏరోనాటికల్‌-ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ సాధించారు. జార్జ్‌ వాషింగ్టన్‌ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి నాసాలో వ్యోమగామి కావాలనే కోరకికు తన కంటి చూప అడ్డుగా మారింది. కటం చూపు అవసరమైన స్థాయిలో లేదని తేలటంతో నిరాశకు గురయ్యారు. ఆ తరువాత కమర్షియల్‌ స్పేస్‌ ఫ్లైట్‌ల రంగంలో అవకాశాల గురించి తెలుసుకొని వర్జిన్‌ గెలాక్టిక్‌లో చేరారు. ప్రస్తుతం అందులో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు

 కలసాకారం చేసుకున్న శిరీష

కలసాకారం చేసుకున్న శిరీష

తాజాగా శిరీషా 'వీఎస్‌ఎస్‌ యూనిటీ-22'లో దూసుకెళ్లి.. తన అంతరిక్ష విహార కలను సాకారం చేసుకున్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌, మరో నలుగురితో కలిసి ఆదివారంనాడు ఆమె అంతరిక్షంలోకి దూసుకుపోయారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బండ్ల పుల్లయ్య మునిమనుమరాలైన శిరీష తాతయ్య రాపర్ల వెంకటనరసయ్య, అమ్మమ్మ రమాదేవి తెనాలి బోసురోడ్డులోని అపార్టుమెంట్‌లో నివసిస్తున్నారు. వీరితో పాటు బంధువులు రామకృష్ణబాబు కలిసి వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్షయాత్ర ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ చానళ్లలో చూశారు.

 శిరీష తాతయ్య అమ్మమ్మలకు అభినందనలు

శిరీష తాతయ్య అమ్మమ్మలకు అభినందనలు

చిన్ననాటి కలను నెరవేర్చుకుని రోదసీలోకి వెళ్లిన తమ మనుమరాలు శిరీష క్షేమంగా తిరిగి వచ్చినందుకు వెంకటనరసయ్య, రమాదేవి ఆనందం వ్యక్తం చేశారు. తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు, మాజీ అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు ఇక్కడికి వచ్చి శిరీష తాతయ్య, అమ్మమ్మలను సత్కరించి, స్వీట్లు తినిపించారు. ఏపీ గవర్నర్ తో పాటుగా ముఖ్యమంత్రి జగన్..ప్రతిపక్ష నేత చంద్రాబు సైతం శిరీషాను అభినందించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు శిరీషా కు కంగ్రాట్స్ చెబుతూ..ఇట్స్ సెలబ్రేటింగ్ టైమ్ అంటూ ప్రశంసలతో హోరెత్తిస్తున్నారు.

English summary
Telugu origin Indo American Sirisha Bandla success space tour in VSS Unity-22 . Indian people all over the world are appreciating Sirisha Bandala for her achievement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X