పులిచింతలపై ఏపీ, తెలంగాణ చర్చలు సఫలం- కేసీఆర్ దృష్టికి జగన్ సర్కార్ అభ్యంతరాలు

ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి నెలకొన్న వివాదానికి తాత్కాలికంగా తెరపడనుంది. పులిచింతలలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. చివరికి ఈ వివాదం కాస్తా చినికి చినికి గాలి వానగా మారి ఇరు రాష్టాలు పోలీసుల్ని మోహరించుకునే వరకూ వెళ్లాయి. ఈ నేపథ్యంలో అధికారుల స్ధాయిలో జరిగిన చర్చలు ఫలించడంతో తాత్కాలికంగా ఉద్రిక్తతలు సద్దుమణిగేందుకు మార్గం సుగమమైంది.

పులిచింతల ప్రాజెక్టు నుంచి తెలంగాణ అక్రమంగా నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుకోవడంపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఇవాళ ఇరు రాష్ట్రాల అధికారులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని చర్చలు జరిపారు. రాబోయేది వర్షాకాలం కాబట్టి నీరు వృథాగా పోవడం కంటే కరెంటు ఉత్పత్తికి వాడుకుంటున్నట్లు తెలంగాణ జెన్ కో అధికారులు ఏపీ అధికారులకు చెప్పారు. అయితే ముందస్తు అనుమతి తీసుకోకుండా వాడుకోవడంపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఏపీ నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను పరిశీలించేందుకు తెలంగాణ అంగీకరించింది. ఏపీ ఇచ్చిన అభ్యంతరాలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు అంగీకరించారు. దీంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది.

telugu states talks successful over power production in pulichintala, ts to consider ap objections

అంతకు ముందు పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. నీటి వాడకం విషయంలో ఏపీ, తెలంగాణ వివాదాలతో సరిహద్దులోని బ్యారేజీలపై పెద్ద ఎత్తున ప్రజలు చేరుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణాబోర్డు అనుమతి లేకుండానే పులిచింతల నీటిని తెలంగాణ వాడుకోవడంపై ఏపీ నీటిపారుదలశాఖ అధికారులు బోర్డుకు లేఖ రాశారు. పులిచింతల నుంచి వ్యవసాయానికి నీటి విడుదల చేస్తూనే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంది. కానీ తెలంగాణ జెన్ కో అధికారులు ఎలాంటి అనుమతుల్లేకుండా మంగళవారం రాత్రి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంతో వివాదం నెలకొంది.

పులిచింతల రిజర్వాయర్‌లో బుధవారం ఉదయానికి 18.07 టీఎంసీల నీళ్లున్నాయి. 2021-22 ఖరీఫ్‌ కాలానికి కృష్ణాడెల్టా ఆయకట్టులో ఇంకా సాగు ప్రారంభం కాలేదు. ఇలా అనధికారికంగా, అకస్మాత్తుగా పులిచింతల ప్రాజెక్టు నీటితో జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తే ఆ నీరంతా వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సి ఉంటుందని ఏపీ చెబుతోంది. రాష్ట్ర విభజన తర్వాత పులిచింతల డ్యాం నిర్వహణ, నీటి నియంత్రణ ఏపీ పరిధిలోకి వచ్చింది. కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకు అనుగుణంగా పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్తు ఉత్పత్తిని చేపట్టాలే తప్ప విడిగా చేయకూడదు. కానీ తెలంగాణ ప్రభుత్వం పులిచింతల నుంచి నీటిని వాడేస్తోంది. దీంతో ఈ వివాదం తలెత్తింది.

ప్రస్తుతం జలవిద్యుత్తు పేరుతో నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల నుంచి దిగువకు వదిలేస్తున్న నీటిని తెలంగాణ రాష్ట్ర కోటా 299 టీఎంసీల నుంచి మినహాయించాలని ఏపీ కోరుతోంది. జల వివాదాల నేపథ్యంలో సాగర్‌ వద్ద తెలంగాణ పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన.. తెలంగాణ భూభాగంలో ఉన్న సాగర్‌ ప్రధాన జలవిద్యుత్తు కేంద్రం ముఖద్వారం వద్దకు పెద్ద ఎత్తున బలగాలు.చేరుకున్నాయి. ఏఆర్‌, సివిల్‌, గ్రేహౌండ్స్‌, బలగాలకు చెందిన 200 మంది సాగర్‌ ప్రధాన డ్యాంపై, ప్రధాన జలవిద్యుత్తు కేంద్రం వద్ద వాహనాలతో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాయి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+