ఒడిషా వర్సిటీ ప్రాంగణంలో శవమైన ఆంధ్ర విద్యార్థి: హత్యేనని పేరెంట్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

ఏలూరు : ఒడిషాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతన్ని వంశీకృష్ణగా గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం బొర్రపాలెంకు చెందిన వంశీ పర్లాకిమిడి సెంచరియన్ యూనివర్శిటీలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

అయితే వంశీ వర్శిటీ ప్రాంగణంలో శవమై కనిపించాడు. తోటి విద్యార్థులు గమనించి విశ్వవిద్యాలయం యాజమాన్యానికి సమాచారం అందించారు. తమ కుమారుడిది ముమ్మాటికి హత్యేనని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ బిడ్డ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

కాగా, వంశీకృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజీ యాజమాన్యం అంటోంది. మీడియాలో వచ్చిన వార్తాకథనాల ప్రకారం - వంశీకృష్ణ శవం పడి ఉన్న చోట ఆనవాళ్లు లభించకుండా శుభ్రం చేశారు. అతడి శరీరంపై గాయానికి సంబంధించిన ఆనవాళ్లున్నాయి.

Telugu student dies in Odisha in suspicious conditions

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల మధ్య గల కక్షలు వంశీకృష్ణ మృతికి కారణమై ఉండవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఒడిషాలోని ఓ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి వంశీకృష్ణ శవమై కనిపించాడు. అతన్ని హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Andhra student Vamshi Krishna died in an University campus in Odisha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి