టిక్‌టాక్ పరిచయం: తెలుగు బుల్లితెర నటి ఆత్మహత్య: మౌనరాగం, మనసు మమతతో ఫేమ్

హైదరాబాద్: ప్రముఖ టీవీ సీరియళ్ల నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ మధురానగర్‌లోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. నిర్జీవ స్థితిలో కనిపించిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని తెలుస్తోంది. టిక్‌టాక్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు.. తరచూ వేధింపులకు పాల్పడుతుండటంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. శ్రావణి కుటుంబ సభ్యులు అతనిపై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Recommended Video

    సీరియల్ నటి శ్రావణి సూసైడ్.. Tik Tok పరిచయమే కారణం! || Oneindia Telugu

    ఏడేళ్లుగా టీవీ సీరయళ్లలో...

    ఏడేళ్లుగా టీవీ సీరయళ్లలో...

    ఏడేళ్లుగా శ్రావణి టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. మనసు మమత, మౌనరాగం సీరియళ్లతో ఆమె గుర్తింపు పొందారు. టీవీ నటిగా స్థిరపడిన ఆమెకు కొంతకాలంగా కిందట తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి అనే యువకుడితో టిక్‌టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ఆత్మహత్యకు దారి తీసినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రేమ పేరుతో దేవరాజు రెడ్డి శ్రావణిని వేధింపులకు గురి చేస్తుండే వాడని అంటున్నారు. డబ్బుల కోసం వేధిస్తుండే వాడని, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతుండేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వేధింపులను భరించలేక శ్రావణి బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

    మధురానగర్‌లో తన గదిలో...

    మధురానగర్‌లో తన గదిలో...

    మంగళవారం రాత్రి మధురానగర్‌లోని తన గదిలో నిర్జీవంగా వేలాడుతూ కనిపించిన శ్రావణిని కుటుంబ సభ్యులు హుటాహుటిన యశోదా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారకుడిగా భావిస్తోన్న దేవరాజు రెడ్డిపై కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

    దేవరాజు రెడ్డి వేధింపులు

    దేవరాజు రెడ్డి వేధింపులు

    దేవరాజు రెడ్డి సికింద్రాబాద్‌లో ఉండేవాడని, శ్రావణి ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలిసిన వెంటనే పరారయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే శ్రావణి 80 వేల రూపాయలను అతని అకౌంట్‌కు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేశారని ఆమె సోదరుడు తెలిపాడు. అంతకుముందు మరో 30 వేల రూపాయల నగదును అతనికి అందజేసినట్లు చెప్పాడు. ఇంకా డబ్బులు కావాలని వేధిస్తుండటంతో శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారని అన్నాడు. దేవరాజు రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిామాండ్ చేశాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+