ఏపీలోని ఈ జిల్లాల్లో 44 డిగ్రీల‌కు చేరువ‌లో ఉష్ణోగ్ర‌త‌లు.. ఐఎండీ హెచ్చ‌రిక‌

ఏపీలో రాబోయే రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌నున్నాయి. ఎండలు, వేడిగాలుల తీవ్రత మరింత పెరగ‌నుందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఇక‌, మంగళవారం నాడు రాష్ట్రంలోని 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయ‌ని ఐఎండీ సూచిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భానుడు త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవ‌కాశం ఉంది. వేడిగాలులు వీచే ప్రాంతాల్లో పార్వతీపురం మన్యం 13, శ్రీకాకుళం 15, విజయనగరం 22, అల్లూరి 3, అనకాపల్లి 4, కాకినాడ 3, తూర్పుగోదావరి 2, ఏలూరు జిల్లా వేలేర్పాడు మండలాలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. వడగాడ్పులతో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. వీటి ప్ర‌భావంగా ఎక్కువ‌గా ఉత్తర కోస్తాలో ఉంది. సోమవారం నాడు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, పాలకొండ, వీరఘట్టంలో 43.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, రాయ‌ల‌సీమ‌లోని నంద్యాల జిల్లా బనగానపల్లెలో 43.3 డిగ్రీలు, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 43.1, పల్నాడు జిల్లా విజయపురిలో, విజయనగరం జిల్లా రాజాంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు, అనకాపల్లి గడిరైలో 42.7 చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోద‌య్యాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Temperatures near 44 degrees in these districts of AP IMD warning

130 మండలాల్లో వడగాడ్పులు..

ఇక‌, నేడు రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్ర‌త‌లు ఉండనున్నాయి. మంగళవారం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లిల‌తో పాటు తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 63 మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వీటితోపాటు శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు 130 మండలాల్లో ఓ మోస్తరు వడగాడ్పులు ఉంటాయని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. ఇక‌, బుధవారం నాడు 38 మండలాల్లో తీవ్రవడగాల్పులు,135 మండ‌లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ వివ‌రించారు.

ఉదయం 11 నుంచి 4 వరకు బ‌య‌టికి రావొద్దు..

రాయలసీమ, దక్షిణకోస్తాలో వేడి వాతావరణం కొన‌సాగ‌గా, ఉత్తర కోస్తాలో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాబ‌ట్టి ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. అత్య‌వ‌స‌ర పరిస్థితుల్లో త‌ప్ప బ‌య‌టికి రావొద్ద‌ని హెచ్చ‌రించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఇంట్లోనే ఉండాలని తెలిపింది. ముస‌లివారు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావ‌ర‌ణ శాఖ సూచించింది. త‌ర‌చుగా ఓఆర్‌ఎస్‌ లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీటిని తీసుకోవాల‌ని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+