టూరిస్ట్స్, ప్రేమజంటలు టార్గెట్: దోపిడీ, అఘాయిత్యం

సోమవారం చీరాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో డిఎస్పీ నరహర వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి రూ.3.50లక్షల విలువైన బంగారం, ఎనిమిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు ముఠాల్లో కలిపి పదిమంది ఉన్నారు. వీరంతా రామాపురం, వాడరేవు తదితర ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే పర్యాటకులు, ఏకాంతంగా ఉండే జంటలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అరాచకాలకు పాల్పడేవారు.
ప్రధానంగా నగలు, డబ్బు, సెల్‌ఫోన్లను అపహరించేవారు. కొన్ని సందర్భాల్లో జంటలలోని మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారు. కొందరు బాధితులు పోలీసుల వరకూ వెళ్తే పరువుపోతుందని వెనుకంజ వేయడంతో వారి ఆగడాల శృతిమించాయి. ఈ రెండు ముఠాలకు సంబంధించి ఇటీవల నమోదైన కేసుల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
20 పైగా నేరాలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులకు అందిన రిపోర్టుల్లో బంగారు ఆభరణాలు అపహరించినట్లు మాత్రమే ఉంది. తీగలాగితే డొంక కదిలినట్లు వీరి అరా చకాలు వెలుగు చూశాయి. నిందితులను కోర్టుకు హాజరుపరచనున్నట్లు డిఎస్పీ తెలిపారు.












Click it and Unblock the Notifications