10 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్, జానారెడ్డి నిలదీత
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన పదిమంది శాసన సభ్యులను వారం రోజుల పాటు సభాపతి మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మంత్రి హరీష్ రావు సస్పెన్షన్ ప్రతిపాదించారు.
టీడీపీ సభ్యులు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి, గాంధీ, గోపినాథ్, వివేకానంద, కిషన్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ప్రకాశ్ గౌడ్, రాజేందర్ రెడ్డి, సాయన్నల పైన సస్పెన్షన్ వేటు పడింది. సస్పెండైన సభ్యులను సభాపతి మార్షల్స్‌తో బయటకు పంపించారు. సస్పెండైన సభ్యులు అసెంబ్లీ గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు.

పునఃపరీశీలించాలి: జానా
తెలుగుదేశం పార్టీ సభ్యుల సస్పెన్షన్ పైన పునఃపరిశీలన చేయాలని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి శాసన సభలో అన్నారు. విపక్ష సభ్యులు పొరపాటుగా మాట్లాడితే.. క్షమాపణ డిమాండ్ చేసినట్లే, అధికార పార్టీ సభ్యులు కూడా పొరపాటు చేస్తే క్షమాపణ చెప్పిస్తారా అని ప్రశ్నించారు.
అధికార సభ్యులే మిగులుతారు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ప్రతి దానికి ఇలా సస్పెండ్ చేసుకుంటూ వెళ్తే సభలో చివరకు అధికార పక్షం మాత్రమే మిగులుతుందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ అన్నారు. సభ్యులు ఆత్మవిమర్శ చేసుకొని సభ సజావుగా సాగేలా కృషి చేయాలన్నారు. సభ సజావుగా సాగేందుకు పాలకపక్షమే చొరవ తీసుకోవాలన్నారు. చర్చ సజావుగా సాగేలా చర్య తీసుకోవాలన్నారు.
టీడీపీ సభ్యులు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. తెలంగాణ టీడీపీ సభ్యులు రైతుల ఆథ్మహత్యలను కూడా రాజకీయం చేస్తున్నారన్నారు.
అంతకుముందు సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. తాము ఎవరికో భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం కూడా చర్చ జరగాలని కోరుకుంటోందన్నారు. నోటీకొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. నోడల్ అధికారి ఇచ్చిన రిపోర్ట్ తమ వద్ద ఉందని, కల్వకుంట్ల కవిత ఒకే స్థానంలో వివరాలు ఇచ్చారన్నారు. ఇందుకు రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
-
కేసీఆర్ కు జీతం కట్ పై నిర్ణయం: సీఎం రేవంత్ -
వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. మార్చి 23నుండి మీ సమయం, డబ్బు రెండూ ఆదా! -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..?












Click it and Unblock the Notifications