వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి భవన్లో ఉద్రిక్తత: సీమాంధ్రలో మోకాళ్లపై (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎపి భవన్‌లో బుధవారం స్వల్ప ఉద్రిక్తత చోట చేసుకుంది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు నేపథ్యంలో ఎపి భవన్‌లో కొద్ది రోజులుగా ఉద్రిక్తత చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎపిఎన్జీవోలు చిత్తూరు నగరంలోని చెన్నై - బెంగళూరు 4వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. కాంగ్రెసు పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారి దిగ్బంధం కారణంగా ట్రాఫిక్ జాం అయింది.

లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ పైన తెలంగాణ న్యాయవాదుల దాడిని నిరసిస్తూ సీమాంధ్రలోని పలు జిల్లాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. జెపిపై దాడికి నిరసనగా ఈ రోజు ధర్నాకు ఆ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఎపిఎన్జీవో

ఎపిఎన్జీవో

తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖపట్నంలో ఎపిఎన్జీవోలు కేంద్రం దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న దృశ్యం.

ఎపిఎన్జీవో

ఎపిఎన్జీవో

తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖపట్నంలో ఎపిఎన్జీవోలు దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న దృశ్యం.

ఆంధ్రా విశ్వవిద్యాలయం

ఆంధ్రా విశ్వవిద్యాలయం

తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మోకాళ్లపై నిరసన.

లాయర్లు

లాయర్లు

తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖపట్నంలో లాయర్లు కేంద్రం దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న దృశ్యం.

English summary
Tension took place at AP Bhavan on Wednesday morning again over Telangana Draft Bill issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X