భారతి ఫ్యాక్టరీ వద్ద టెన్షన్, దొంగలు పారిపోయారు

కడప: కడప జిల్లాలోని కమలాపురం మండలంలో టెన్స్‌న్‌ వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం భారతీ సిమెంట్స్‌ ఫ్యాక్టరీ వద్ద సమీప గ్రామాల ప్రజలు ధర్నాకు దిగారు. ఫ్యాక్టరీ కాలుష్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలు ఇచ్చిన వారికి పర్మినెంట్‌ చేయాలని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సైతం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.

ఎర్రచందనం దుంగల అపహరణకు స్మగ్లర్ల విఫలయత్నం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్మగ్లర్ల నుంచి అటవీశాఖ అధికారులు పట్టుకున్న ఎర్రచందనం దుంగలను తిరిగి అపహరించేందుకు స్మగ్లర్లు విఫలయత్నం చేశారు. ఉదయగిరి అటవీశాఖ కార్యాలయంలోని గోదాములో కోట్లాది విలువ చేసే ఎర్రచందనం నిల్వలు ఉండటంతో చుట్టూ ప్రహరీ గోడ కట్టి సీసీ కెమెరాలు అమర్చారు.

Tension at Cement Factory in Kadapa district

అయితే బరితెగించిన స్మగ్లర్లు సీసీ కెమెరాలను తొలగించి ఎర్రచందనం దుంగలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో కుక్కలు మొరగడంతో స్మగ్లర్లు పరారయ్యారు. అయితే పోలీసులు ఉదయం స్థానికుడైన ఓ వ్యక్తి అరెస్ట్‌ చేశారు. అతడే దొంగతనానికి ప్రయత్నించాడని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ సీసీ టీవీ దృశ్యాల్లో అసలు దొంగ ఉన్నా అధికారులు అతడిని దాచిపెట్టి అమాయకుడిని అరెస్ట్‌ చేశారని స్థానికులు ఆరోపించారు.

ఏనుగుల గుంపు బీభత్సం

చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం ఏ.గుట్టపల్లిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. పలు పంటలపై పడి ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగులను అడవిలోకి పంపేందుకు అటవీ అధికారులు యత్నించారు. అయితే అటవీ అధికారులపై ఏనుగుల గుంపు దాడికి యత్నించడంతో వారు చెల్లాచెదురైపోయారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం: తల్లి మృతి

విశాఖపట్నం జిల్లాలోని పెదగంట్యాడ బర్మాకాలనీలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం తల్లీకొడుకు బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కొడుకును స్థానికులు రక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+