చిరు నివాసం వద్ద స్నానాలు, కిరోసిన్ పోసుకున్న వ్యక్తి
న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి నివాసం వద్ద ఓ సమైక్యవాది నిప్పు అంటించుకునే ప్రయత్నాలు చేశారు. సమైక్యాంధ్ర కోసం చిరు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు సమైక్యవాదులు ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద నిరసన చేపట్టారు.
సోమవారం ఉదయం ఆయన ఇంటి ఎదురుగా ఆరు బయటే స్నానాలు చేశారు. ఈ సమయంలో ఓ విద్యార్థి కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నాలు చేశాడు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను, సమైక్యవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, అల్లూరి గడ్డపై జన్మించిన మూర్ఖుడు చిరంజీవి అని సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస మండిపడింది. రెండు వారాల మంత్రి పదవి కోసం ఆయన పాకులాడుతున్నారన్నారు. సోనియాకు అమ్ముడుపోయారని ఆరోపించారు.
అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట యోధుడు జన్మించిన గడ్డపై జన్మించిన మూర్ఖుడు అన్నారు. పదికోట్ల మంది తెలుగు వారికి చిరు మోసం చేశారన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయని చిరంజీవిని తాము సొంత జిల్లాలో కూడా అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు.
టిడిపి అవిశ్వాసం నోటీసు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సోమవారం ఉదయం అవిశ్వాస నోటీసు ఇచ్చారు.












Click it and Unblock the Notifications