అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత .. చదలవాడలో పోలీసుల లాఠీ చార్జ్ , విరిగిన రైతు చెయ్యి; లోకేష్ ఫైర్
ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అడుగడుగునా ఆంక్షలతో 11వ రోజున నాగులుప్పాడు నుండి మహా పాదయాత్ర ప్రారంభించిన రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రైతుల పాదయాత్రకు విశేషంగా మద్దతు వస్తున్న క్రమంలో పోలీసులు రైతుల మహాపాదయాత్ర లో ఎవరూ ఇతరులు పాల్గొనకూడదని, వారికి సంఘీభావం తెలిపేందుకు రాకూడదని ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలపడానికి వచ్చేవారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.

చదలవాడలో రైతులపై పోలీసుల లాఠీ చార్జ్ .. విరిగిన రైతు చెయ్యి
నాగులుప్పాడు మండలం చదలవాడ వద్ద రైతులు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలపడానికి వచ్చిన స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకోవడానికి లాఠీఛార్జి చేశారు. రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు వస్తే అడ్డుకోడానికి మీరెవరు అంటూ స్థానికులు, రైతులు సైతం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోగా, పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో సంతనూతలపాడు కు చెందిన రైతు నాగార్జున చెయ్యి విరిగింది పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి రైతుల మహా పాదయాత్రపై అడుగడుగునా పోలీసుల ఆంక్షలు .. రైతుల ఆగ్రహం
మరోవైపు అమరావతి రాజధానిగా కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతు తెలపడానికి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు . ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధం చేసి రైతుల పాదయాత్రలో స్థానికులు పాల్గొనకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం పాదయాత్ర ప్రారంభించిన క్రమంలో అమరావతి రైతుల శిబిరం వద్దకు చేరుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇతరులెవరూ పాదయాత్రలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేశారు .రాజధాని ప్రాంతానికి చెందిన అనుమతి పొందిన 157 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని తెలిపారు .అమరావతి జేఏసీ నేతలకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.
పోలీసుల తీరుపై మండిపడిన అమరావతి జేఏసీ.. పోలీసుల లాఠీ చార్జ్ పై లోకేష్ ఫైర్
ఇక పోలీసుల తీరుపై రాజధాని ప్రాంత రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము పార్టీలకతీతంగా పోరాటం చేస్తున్నామని తమ కి ఎందుకు నోటీసులు ఇస్తారు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రాజధాని అమరావతి పాదయాత్రను అడ్డుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని, అందుకే రకరకాల ఆంక్షలు పెడుతున్నారని రాజధాని ప్రాంత రైతులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలో రాజధాని అమరావతి కోసం మహా పాదయాత్ర నిర్వహిస్తున్న రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హైకోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రకి ఖాకీల ఆంక్షలు ఎందుకో: లోకేష్
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చెయ్యడం దారుణం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని లోకేష్ పేర్కొన్నారు. పోలీసుల్ని ప్రయోగించి పాదయాత్రకి అడుగడుగునా ఆటంకాలు కల్పించడం న్యాయమా? అంటూ ప్రశ్నించారు. హైకోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రకి ఖాకీల ఆంక్షలు ఎందుకో చెప్పాలంటూ నిలదీశారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారుల పై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications