విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ రెడ్ జోన్లలో ఉద్రిక్తతలు- జనం సహాయనిరాకరణ- అధికారుల చర్చలు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల నుంచి ఆశించిన సహకారం మాత్రం అందడం లేదు. కొన్ని చోట్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఇళ్ల వద్దకే కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపుతున్నా జనం మాత్రం రోడ్లపైకి రావడం మాత్రం ఆపడం లేదు. ఇదే కోవలో ఏర్పాటు చేసిన సంచార రైతు బజార్లను విజయవాడ రెడ్ జోన్లలో ప్రజలు అడ్డుకోవడం కలకలం రేపుతోంది.

రెడ్ జోన్ లో విజయవాడ నగరం..

రెడ్ జోన్ లో విజయవాడ నగరం..

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా జనం లైట్ తీసుకోవడంతో విజయవాడ నగరమంతా ప్రస్తుతం రెడ్ జోన్ పరిధిలోకి వచ్చేసింది. నగర మంతా ఆంక్షలు కొనసాగుతున్నాయి. వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కాక తప్పని పరిస్ధితి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం జనాలను ఇళ్ల నుంచి బయటకు రావడాన్ని నిరుత్సాహపరిచేందుకు సంచార రైతు బజార్లను ఏర్పాటు చేసింది. రెడ్ జోన్లలో ఇళ్ల వద్దకే వెళ్లి ఇవి జనానికి అవసరమైన నిత్యావసరాలను అందిస్తున్నాయి.

 రావొద్దంటున్న అపార్ట్ మెంట్ వాసులు..

రావొద్దంటున్న అపార్ట్ మెంట్ వాసులు..

విజయవాడ పరిధిలో ఆంక్షలు విధించిన రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేసేందుకు వెళుతున్న సంచార రైతు బజార్లను ఆపార్ట్ మెంట్ నిర్వాహకులు అడ్డుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కరోనా వైరస్ భయాలతో సంచార రైతు బజార్లను అడ్డుకుని వెనక్కి పంపేస్తుండటంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ సాయంతో సంచార రైతు బజార్లను నిర్వహిస్తోందని అధికారులు చెబుతున్నారు. కానీ అపార్ట్ మెంట్ వాసులు వీటిని అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి.

Recommended Video

Disinfection Tunnel Open in Vijayawada at Indira Gandhi Stadium Municipal Stadium
 అపార్ట్ మెంట్ నిర్వాహకులతో అధికారుల చర్చలు..

అపార్ట్ మెంట్ నిర్వాహకులతో అధికారుల చర్చలు..

విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ తో పాటు ఇతర అధికారులు తాజా పరిస్ధితిపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత రెడ్ జోన్లలో సంచార రైతు బజార్లను అడ్డుకుంటున్న అపార్ట్ మెంట్ వాసులతో చర్చలు నిర్వహించారు. జనంలో అపోహల వల్లే సంచార రైతు బజార్ల ద్వారా కూరగాయలు అమ్మకుండా అడ్డుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకరించాల్సింది పోయి అడ్డుకోవడం సహాయ నిరాకరణే అవుతుందని అంటున్నారు.

English summary
tension prevails in some redzones in vijayawada city as few apartment owners not allow mobile raithu bazars in their areas with the fear of coronavirus spread. corporation officials hold meeting with the apartment owners and request them to allow mobile teams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X