ముద్రగడ ఎఫెక్ట్: కిర్లంపూడిలోనే 2 వేలమంది పోలీసులు, ఉద్రిక్తత
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల 26వ తేదీ నుంచి తన పాదయాత్ర ప్రారంభిస్తానని చెబుతున్నారు. మరోవైపు, పాదయాత్రకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు.
కిర్లంపూడి: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల 26వ తేదీ నుంచి తన పాదయాత్ర ప్రారంభిస్తానని చెబుతున్నారు. మరోవైపు, పాదయాత్రకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు.
అయితే, తాను ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో భారీగా పోలీసులు మోహరించారు.

జిల్లా వ్యాప్తంగా 5 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం కిర్లంపూడిలోనే రెండు వేలమంది పోలీసుల నిఘా పెట్టారు.
ముద్రగడను కాపు ఉద్యమనేతలు కలవనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications