వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓపక్క ప్రమాద ఘంటికలు..!మరో పక్క విధుల నిర్వహణ..!ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్..!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవస్థలన్నీ మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కార్యచరణ రూపొందించింది. కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో స్తంభించిపోయిన జనజీవన స్రవంతిని సాధారణ స్థితిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ ఆంక్షల అమలులో భాగంగా అన్ని రంగాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిషేంధించిన ప్రభుత్వం వాటన్నింటిని పునరుద్దరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఓ పక్కకరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నప్పటికి ఆర్థికపరమైన అంశాల్లో వెనకబడకూడదనే నిశ్చయంతో ప్రభుత్వం ఈ రకమైన సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: అన్నీ హైదరాబాద్‌లోనేతెలంగాణలో మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: అన్నీ హైదరాబాద్‌లోనే

 ఏపీలో రేపటి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం.. ఉద్యోగుల హాజరు తప్పనిసరన్న ప్రభుత్వం..

ఏపీలో రేపటి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం.. ఉద్యోగుల హాజరు తప్పనిసరన్న ప్రభుత్వం..

ఐతే బుదవారం వరకూ ఇళ్లకే పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులు గురువారం నుండి కార్యాలయాలకు చేరుకుని విధులు నిర్వాహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు యధాతదంగా ఉండటమే కాకుండా కేసుల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళనకరంగా మారింది. స్వీయ నియంత్రణకు అలవాటుపడిన ఉద్యోగులు మళ్లీ బాహ్యప్రపంచంలోకి వస్తే ఏం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఓ పక్క కరోనా మహమ్మారి భయం, మరోపక్క ప్రభుత్వ ఆదేశాల మద్య ప్రభుత్వ ఉద్యోగులు నటిగిపోతున్నట్టు తెలుస్తోంది.

 వంద శాతం ఉద్యోగుల హాజరు కావాలి.. ఆదేశాలు జారీ చేసిన ఏపి సర్కార్..

వంద శాతం ఉద్యోగుల హాజరు కావాలి.. ఆదేశాలు జారీ చేసిన ఏపి సర్కార్..

అంతే కాకుండా ఈ నెల 21వ తారీఖు గురువారం నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ఉద్యోగుల హాజరుతో విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో యధావిధిగా విధులకు హాజరు కావాలని, మాస్క్ లేకుండా ఏ ఉద్యోగి కూడా విధులకు హాజరు కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారు, గర్భవతులు, ఎక్కువ వయస్సుగల వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం పరిస్థితుల ఆధారంగా వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతించనుంది ఏపి ప్రభుత్వం.

 ఉద్యోగులకు ప్రభుత్వం మార్గదర్శకాలు.. వాటికనుగుణంగా విధులు నిర్వహించాలన్న సర్కార్..

ఉద్యోగులకు ప్రభుత్వం మార్గదర్శకాలు.. వాటికనుగుణంగా విధులు నిర్వహించాలన్న సర్కార్..

భౌతికంగా పంపించే అధికారిక ఫైళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించి పంపాలని, ఈ -ఫైళ్ల ద్వారా సమాచారం షేర్ చేసుకోవాలని, దానికనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఏపి ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. కార్యాలయాల ప్రాంగణంలోకి ప్రవేశించే ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి, చేతులను శానిటైజ్‌ చేసిన తరువాత పంపిస్తారని తెలిపింది. అన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు శానిటైజ్‌ చేయాలని, ప్రతీ ఉద్యోగి విధిగా మాస్క్‌ ధరించి విధులకు హాజరు కావాలని, కార్యాలయాల్లో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు.

 ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్.. భయపెడుతున్న వైరస్ వ్యాప్తి..

ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్.. భయపెడుతున్న వైరస్ వ్యాప్తి..

ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికి, ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఉద్యోగుల్లో ఏదో తెలియని భయం వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. ఎవరికి కరోనా వైరస్ ఉందో ఎవరికి లేదో గుర్తించడం ఎలా అనే అంశంపై ఉత్కంఠతకు గురవుతున్నట్టు తెలుస్తోంది. కార్యాలయ సిబ్బందిలో ఎవరికైనా కరోనా ప్రభావం ఉండి అది ఇతరకులకు వ్యాపించకుండా ఉంటుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి వచ్చి వెళ్లేటప్పుడు చాలా మందితో సంభాషించే అవసరం ఉంటుందని, ఎవరిని ఎలా నిర్ధారించాలని లోలోన గుబులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఐనప్పటికి ప్రభుత్వం ఆదేశాలకనుగుణండా విధులు నిర్వహించక తప్పదనేు అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
The government has ordered all government offices in AP to be fully functioning with 100% attendance.The state secretary general Neelam Sahni issued an order on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X