వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డకు కౌంట్‌డౌన్ ప్రారంభం-20 రోజుల్లో రిటైర్మెంట్‌- పరిషత్‌ పోరు ముగిస్తారా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారుతో అమీతుమీ సాగించిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాదాపుగా తన పంతం నెరవేర్చుకున్నారు. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు కల్పించినా, కోర్టుల్లో కేసులతో ఇబ్బందిపెట్టినా లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోయారు. ఫలితంగా ఏపీలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయ్యాయి. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు మరో మూడు రోజుల్లో వెలువడాల్సి ఉంది. అయితే ఇదే ఊపులో పరిషత్‌ ఎన్నికలను కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయనకు న్యాయపరమైన చిక్కులు తప్పడం లేదు. వాటిని ఆయన రిటైర్మెంట్‌లోపు అధిగమించి ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

‌ ఏపీలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు సక్సెస్‌

‌ ఏపీలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు సక్సెస్‌

గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పూర్తి చేస్తారని ఎవరూ భావించలేదు. దీనికి ప్రధాన కారణం కరోనా పరిస్ధితులతో పాటు ఎన్నికల నిర్వహణకు వైసీపీ సర్కారు అడుగడుగునా అడ్డుకున్న తీరే. అయితే అడ్డంకులన్నీ అధిగమించి నిమ్మగడ్డ విజయవంతంగా పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలను పూర్తి చేసేశారు. సరిగ్గా నెల రోజుల క్రితం ఆయన పంచాయతీ పోరును ముగిస్తే గొప్పని అనుకున్న వారు కూడా ఓసారి పని మొదలుపెట్టాక ఆయన దూకుడు చూసి అభిప్రాయం మార్చుకోక తప్పలేదు. చివరికి ఆయనపై పెద్ద యుద్ధమే చేసిన వైసీపీ ప్రభుత్వమే దిగొచ్చేసింది. దీంతో ఎన్నికలు సజావుగా సాగిపోయాయి.

నిమ్మగడ్డకు పరిషత్‌ పోరు సవాల్‌

నిమ్మగడ్డకు పరిషత్‌ పోరు సవాల్‌


స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలనైతే విజయవంతంగా పూర్తి చేశారు కానీ ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేయడం ఆయనకు సవాల్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం న్యాయపరమైన చిక్కులే. గతంలో భారీగా ఏకగ్రీవాలైన ఎన్నికల్లో పరిషత్‌ పోరు కూడా ఒకటి. దీనిపై అప్పట్లో స్వయంగా నిమ్మగడ్డ తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. కానీ ఇప్పుడు గతంలో ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయంలో నిమ్మగడ్డ అభిప్రాయం మారింది కానీ విపక్షాల వాదన మాత్రం అలాగే ఉంది. దీంతో జనసేనతో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ పూర్తయి తీర్పు రిజర్వ్‌లో ఉంది.

 20 రోజుల్లో నిమ్మగడ్డ రిటైర్మెంట్‌

20 రోజుల్లో నిమ్మగడ్డ రిటైర్మెంట్‌

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల కమిషనర్‌గా నియమించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరేళ్ల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తవుతుంది. మార్చి 31న ఆయన ఎన్నికల కమిషనర్‌గా వైదొలగాల్సి ఉంటుంది. ఈలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేస్తారా లేదా అన్న ఉత్కంఠ సాగుతోంది. పరిషత్‌ పోరుపై హైకోర్టులో దాఖలైన కేసుల తీర్పు రావాల్సి ఉంది. ఆ తీర్పు తర్వాత కూడా మరిన్ని పిటిషన్లు దాఖలైతే ఇబ్బందులు తప్పవు. అవేవీ లేకున్నా 20 రోజుల్లో పరిషత్‌ పోరు ముగించడం ఎస్ఈసీ నిమ్మగడ్డకు కత్తి మీద సామే. దీంతో రిటైర్మెంట్‌ లోపు నిమ్మగడ్డ పరిషత్‌ పోరు పూర్త చేస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది.

నిమ్మగడ్డ పదవీకాలం పొడిగిస్తారా ?

నిమ్మగడ్డ పదవీకాలం పొడిగిస్తారా ?

ఒకవేళ ఈ నెలాఖరులోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకపోతే నిమ్మగడ్డ రిటైర్ అయి వెళ్లిపోతారు. ఆయన స్ధానంలో ప్రభుత్వం నియమించే కొత్త కమిషనర్‌ ఈ ఎన్నికలు పూర్తి చేస్తారు. అలా కాకుండా ఈ 20 రోజుల్లోనే పరిషత్‌ పోరు నిర్వహణకు ఎస్ఈసీ రీషెడ్యూల్‌ విడుదల చేస్తే అప్పుడు ఏం జరుగుతుందన్నది మరింత ఉత్కంఠ రేపుతోంది. పరిషత్‌ ఎన్నికలు మధ్యలో ఉండగా తాను రిటైర్‌ అయితే కొత్తగా వచ్చే ఎస్‌ఈసీకి ఇబ్బందులు ఉంటాయని, కాబట్టి తనకు పదవీకాలం పొడిగింపు ఇవ్వాలని నిమ్మగడ్డ కోరే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రభుత్వం, గవర్నర్‌ అంగీకరించకపోతే నిమ్మగడ్డ మళ్లీ హైకోర్టును ఆశ్రయించి పొడిగింపు తెచ్చుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది.

English summary
andhra pradesh sec nimmagadda ramesh kumar's term to be concluded on march 31. he tries to hold mptc and zptc elections before leaving the office. but legal issues creates troubles to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X