బాలికపై టెన్త్ విద్యార్థి రేప్: కొడుకు గొంతు కోసిన తల్లి

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా వెంకటాపురంలో సోమవారం దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై స్థానికంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థి అత్యాచారం చేశాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు.

కాగా, అనంతపురం జిల్లాలో ధర్మవరంలో సోమవారం దారుణం జరిగింది. ఓ తల్లి తన రెండేళ్ల కొడుకు గొంతుకోసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు.

రైళ్లలో దొంగల బీభత్సం

Tenth class student rapes minor girl

కడప జిల్లాలో పలు రైళ్లలో దొంగలు సోమవారం బీభత్సం సృష్టించారు. రాజంపేట మండలం హస్తవరం రైల్వేస్టేషన్‌ దగ్గర నాగర్‌సోల్‌ ముంబై బాలాజీ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు చొరపడ్డారు. ప్రమాణికుల నుంచి భారీగా నగదు, నగలు అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి దగ్గర సోమవారం కర్ణాటక ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌, ఓ బస్సు ప్రయాణికుడు మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+