వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవరంధ్రాలు: జగన్‌పై అనిత సంచలనం, కాకినాడలో బిజెపికి టిడిపి షాక్ ఎందుకంటే?

కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్‌లో టిడిపి గెలుపుపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. రానున్న ఎన్నికల్లో టిడిపి గెలుపుపై ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు. కాకినాడ ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారన్నారు.

|
Google Oneindia TeluguNews

కాకినాడ: కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్‌లో టిడిపి గెలుపుపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. రానున్న ఎన్నికల్లో టిడిపి గెలుపుపై ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు. కాకినాడ ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారన్నారు.

ఆ దెబ్బకు జగన్ భయపడ్డారా, ఎదురుతిరిగిన టిడిపి: బాబుపై బిజెపి ఆగ్రహంఆ దెబ్బకు జగన్ భయపడ్డారా, ఎదురుతిరిగిన టిడిపి: బాబుపై బిజెపి ఆగ్రహం

నారా లోకేష్ ట్వీట్

కాకినాడ ప్రజలకు ధన్యవాదాలు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. అద్భుతమైన విజయాన్ని టిడిపికి కట్టబెట్టారన్నారు. చంద్రబాబు నాయకత్వానికి ఇది మరో పరీక్ష అన్నారు. ఇక కాకినాడను స్మార్ట్ సిటీగా మారుద్దామన్నారు.

నవరంద్రాలు పడ్డాయి, రోజా రాకతోనే: అనిత

నవరంద్రాలు పడ్డాయి, రోజా రాకతోనే: అనిత

జగన్ నవరత్నాల హామీకి నవరంద్రాలు పడ్డాయని ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. వైసిపి ఎమ్మెల్యే రోజా రాకతో టిడిపి గెలుపు ఖాయమైందన్నారు. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి అని జగన్ చెప్పారని, నిజమే.. ఇప్పుడు టిడిపి గెలుపుతో ధర్మం గెలిచిందన్నారు.

టిడిపి-బిజెపికి షాక్‌పై తెలుగు తమ్ముళ్ల వాదన

టిడిపి-బిజెపికి షాక్‌పై తెలుగు తమ్ముళ్ల వాదన

బిజెపి తొమ్మిది స్థానాల్లో పోటీ చేయగా.. చాలాచోట్ల టిడిపి రెబల్స్ పోటీలో నిలబడ్డారు. దీంతో బిజెపి కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది. దీనిపై బిజెపి అసంతృప్తితో ఉంది. అయితే, బిజెపి గెలవలేదని భావించిన చోటనే తాము బరిలోకి దిగామని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఆ స్థానాలు వైసిపికి వెళ్లవద్దనే కొందరిని పోటీలోకి దింపినట్లుగా కూడా భావిస్తున్నారు.

బిజెపికి టిడిపి షాకిచ్చింది ఇక్కడే!

బిజెపికి టిడిపి షాకిచ్చింది ఇక్కడే!

బిజెపి అభ్యర్థులు నిలబడిన చోట రెండు చోట్ల టిడిపి రెబల్స్ గెలుపొందారు. 29, 35వ డివిజన్లలో కమలం పార్టీకి షాకిచ్చారు. రెబల్స్ పోటీ చేయకుంటే తమకు ఈ స్థానాలతో పాటు మరిన్ని వచ్చేవని బిజెపి వాపోతోంది.

టిడిపికి వైసిపి షాకిచ్చింది ఇక్కడే

టిడిపికి వైసిపి షాకిచ్చింది ఇక్కడే

కాకినాడలో 32 స్థానాల్లో టిడిపి, 3 స్థానాల్లో బిజెపి, 10 స్థానాల్లో వైసిపి, 3 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. వైసిపి 4, 9, 15, 21, 22, 23, 24, 32, 30, 47 వార్డుల్లో గెలుపొందారు. 22వ డివిజన్‌లో టిడిపి ఎమ్మెల్యే కొండబాబు సోదరుడి కుమారుడు వైసిపి అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 9వ వార్డులో బిజెపి జిల్లా అధ్యక్షులు మాల్ కొండారెడ్డి ఓడిపోయారు.

English summary
'Thank you Kakinada for the amazing win! Another testimony for ncbn's leadership. Let's build #SmartCityKakinada' Nara Lokesh tweeted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X