వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కసీటు కూడా రాని పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిస్తే వైసీపీనేతల గగ్గోలు దేనికి?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును, పవన్ కళ్యాణ్ కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అధికార వై ఎస్ ఆర్ సి పి పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఇక ఈ క్రమంలో తాజాగా బిజెపి నాయకులు టీజీ వెంకటేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీపై , టిడిపి జనసేన పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ చంద్రబాబు వైపు వెళ్ళటానికి వైసీపీనే కారణం : టీజీ వెంకటేష్

పవన్ చంద్రబాబు వైపు వెళ్ళటానికి వైసీపీనే కారణం : టీజీ వెంకటేష్

పొత్తులపై ఎన్నికలకు ఆరు నెలల ముందే క్లారిటీ వస్తుందని పేర్కొన్న ఆయన పవన్ కళ్యాణ్ కు ఒక్క సీటు కూడా రాదని వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతలు ఎందుకు చంద్రబాబును కలిస్తే గగ్గోలు పెడుతున్నారో చెప్పాలని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రవర్తనే కారణమని టీజీ వెంకటేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలకు కారకులు ఎవరో అందరికీ తెలుసన్నారు. బీజేపీతో జనసేన పొత్తు ఉన్నప్పటికీ, మళ్లీ టిడిపి వైపు వెళ్లక తప్పని పరిస్థితి కల్పించారని, ఈ పరిణామాలకు వైసీపీనే కారణమంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

పొత్తుపై బీజేపీ అధిష్టానం అడిగితే నా అభిప్రాయం చెప్తా: టీజీ వెంకటేష్

పొత్తుపై బీజేపీ అధిష్టానం అడిగితే నా అభిప్రాయం చెప్తా: టీజీ వెంకటేష్


పొత్తులపై బీజేపీ అడిగితే తన అభిప్రాయాన్ని నిష్కర్షగా తెలియజేస్తానని పేర్కొన్న ఆయన బిజెపి కే ముఖ్యమంత్రి పదవి కావాలని అనుకుంటే, టీడీపీతో పొత్తు పెట్టుకోదు అంటూ స్పష్టం చేశారు. ఎవరితోనైనా కలిసి పని చేయాలనుకుంటే బీజేపీ నిర్ణయం వేరేగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా.. లేదా అన్న విషయాన్ని అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని టి.జి.వెంకటేష్ స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకునే విధానం లేదని ఎద్దేవా చేశారు.

బీజేపీతో పొత్తు ఉంటూనే టీడీపీ వైపు పవన్ కళ్యాణ్

బీజేపీతో పొత్తు ఉంటూనే టీడీపీ వైపు పవన్ కళ్యాణ్


ఒకపక్క బీజేపీతో పొత్తులో ఉంటూనే, మరోపక్క పవన్ కళ్యాణ్ టిడిపి వైపు చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఏదిఏమైనా భవిష్యత్తులో పొత్తుల విషయంలో బీజేపీ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే టీడీపీ, జనసేన పొత్తులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అనేక సందర్భాలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా కుప్పం ఘటనపై ఆయనకు సంఘీభావం తెలియచేయడానికి చంద్రబాబు నాయుడు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లి మాట్లాడారు.

ఆసక్తికరంగా ఏపీలో పొత్తుల రాజకీయాలు

ఆసక్తికరంగా ఏపీలో పొత్తుల రాజకీయాలు

ఈ సందర్భంగా పొత్తులపై కొత్త చర్చ ఏపీ లో కొనసాగింది. రెండు పార్టీల పొత్తుల చర్చలు జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. ఇక వైసీపీ నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో ప్యాకేజ్ స్టార్ అంటూ పవన్ ను టార్గెట్ చేశారు. అయితే పొత్తుల విషయం పక్కనబెట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం పై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఇంకా పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రస్తుతం దీనిపై మాట్లాడ్డం సరికాదంటూ ఇరువురు నేతలు మాట దాటవేశారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో పొత్తుల రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి.

English summary
BJP leader TG Venkatesh asked if Pawan Kalyan meets Chandrababu what is the problem to ysrcp leaders. He claimed that it was YCP that made Pawan Kalyan go towards Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X