గ్రూపు -2 పరీక్షలకు సర్వం సిద్దం - ఇవి తప్పనిసరి, వీటికి నో ఎంట్రీ..!!

తెలంగాణలో గ్రూపు -2 పరీక్షలకు సర్వం సిద్దమైంది. టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,368 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ప‌రీక్ష‌ల‌ను ఓఎంఆర్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించ‌నున్నారు. ఈసారి గ్రూప్‌ 2 ఫలితాలను వేగంగా ఇస్తాం అని టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇదే సమయంలో పరీక్షలకు వచ్చే అభ్యర్దులకు కీలక సూచనలు చేసారు.

ఏర్పాట్లు పూర్తి
ఆదివారం, సోమవారం జరగనున్న గ్రూప్‌ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీజీపీఎస్సీ ఛైర్మన్ వెంకటేశం వెల్లడించారు. పది రోజులుగా అన్ని అంశాలను సమీక్షించామని తెలిపారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై నమ్మకముంచి పరీక్షలు రాయాలని కోరారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు అని చెప్పారు. మెరిట్‌ ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు అని అన్నారు. 5.51 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు.

TGPSC made all arrangements for Group -2 exams for Two days details here

వీటిని నో ఎంట్రీ
గ్రూపు -2 లో 783 పోస్టుల భ‌ర్తీకి 2022 డిసెంబ‌ర్ 29న నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ప‌లు కార‌ ణాల వ‌ల్ల ప‌రీక్ష వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ నెల 15, 16 తేదీల్లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకు స‌ర్వం సిద్ధం చేశారు. ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే వారు హాల్ టికెట్‌తో పాటు ఇటీవ‌ల దిగిన పాస్ పోర్టు సైజు ఫొటో, ప్ర‌భుత్వంచే జారీ చేయ‌బ‌డ్డ ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాల‌ని అధికారులు సూచించారు. ఇక మ‌హిళా అభ్య‌ర్థుల‌కు మంగ‌ళ‌సూత్రం, గాజుల వ‌ర‌కే అనుమ‌తిం చ‌నున్నారు. ఇత‌ర ఆభ‌ర‌ణాలు ఉంటే అనుమ‌తించ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ చెప్పులే ధ‌రించాల‌న్నారు. బెల్ట్‌లు, రిమోట్ కీస్‌కు అనుమ‌తి లేద‌ని తెలిపారు.

వేగంగా ఫలితాలు
ఈసారి గ్రూప్‌ 2 ఫలితాలను వేగంగా ఇస్తాం అని టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు. మెరిట్‌ ఉంటే అర్హత సాధించే వారిని ఎవరూ ఆపలేరు అని అన్నారు. 5.51 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. పత్రి ఒక్కరికీ బయోమెట్రిక్‌ తప్పనిసరి అని అన్నారు. ప్రశ్నా పత్రాలకు సంబంధించి 58 స్టోరేజ్‌ పాయింట్లు పెట్టామన్నారు. అభ్యర్థికి తప్ప ప్రశ్నాపత్రం ఎవరికీ తెలిసే అవకాశం లేదు అని స్పష్టం చేశారు. 2015లో గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ అమలుకు చాలా సమయం తీసుకున్నారని అన్నారు. ఈ సారి వేగంగా ఫలితాలు ఇస్తాం అని బుర్రా వెంకటేశం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+