బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖపట్నం చాలా కాస్ట్‌లీ, ఖరీదైన నగరాల్లో 9వ స్థానం: సర్వేలో వెల్లడి

భారత దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ ఐదో స్థానంలో, విశాఖ తొమ్మిదో స్థానంలో నిలిచాయి. విశాఖ కాస్మో పాలిటన్ సిటీ అయింది. ఇటీవల యాహూ విడుదల చేసిన సర్వేలో విశాఖ సూరత్‌ను (10వ స్థానం) దాటేసి 9వ స్థ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Visakhapatnam Ranks 9th Richest City In The Country | Oneindia Telugu

విశాఖ/హైదరాబాద్: భారత దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ ఐదో స్థానంలో, విశాఖ తొమ్మిదో స్థానంలో నిలిచాయి. విశాఖ కాస్మో పాలిటన్ సిటీ అయింది. ఇటీవల యాహూ విడుదల చేసిన సర్వేలో విశాఖ సూరత్‌ను (10వ స్థానం) దాటేసి 9వ స్థానంలో నిలిచింది.

ఇండియా ఫైనాన్స్ టీం అంచనా మేరకు జీడీపీ ప్రకారం 2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఈ సర్వే ఆధారంగా దేశంలో టాప్ 10 నగరాల జాబితాను యాహూ వెల్లడించింది.

 తొలిసారి విశాఖ టాప్ టెన్‌లో

తొలిసారి విశాఖ టాప్ టెన్‌లో

దక్షిణ భారత దేశంలో టాప్ 10లో ఇప్పటి వరకు మూడు నగరాలు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు దశాబ్దాలుగా చోటు దక్కించుకుంటున్నాయి. తొలిసారి విశాఖ కాస్మోపాలిటన్ సిటీల సరసన చోటు దక్కించుకుంది.

టాప్ 10 నగరాలు ఇవే, వాటి జీడీపీ

టాప్ 10 నగరాలు ఇవే, వాటి జీడీపీ

దేశంలోని టాప్ 10 నగరాల్లో ముంబై (జీడీపీ-23.92), ఢిల్లీ (జీడీపీ-19.04), కోల్‌కతా (జీడీపీ-9.75), బెంగళూరు (జీడీపీ-5.39), హైదరాబాద్ (జీడీపీ-4.81), చెన్నై (జీడీపీ-4.29), అహ్మదాబాద్ (జీడీపీ-4.13), పుణే (జీడీపీ-3.38), విశాఖపట్నం (జీడీపీ-2.79), సూరత్ (జీడీపీ-2.6)లు చోటు దక్కించుకున్నాయి.

 జీడీపీలో సూరత్‌ను దాటింది

జీడీపీలో సూరత్‌ను దాటింది

దేశంలో కాస్మో పాలిటన్ నగరాల్లోని సూరత్ జీడీపీని విశాఖ అధఇగమించింది. విశాఖ నడి బొడ్డున గజం ధర రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఉంది. జగదాంబ, బీచ్ రోడ్డు వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో రూ.లక్షన్నరకు పైగా పలుకుతోంది.

విశాఖ ఖరీదు

విశాఖ ఖరీదు

విశాఖ నగరంలో డబుల్ బెడ్ రూం ప్లాట్ రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పైగా పలుకుతోంది. అద్దెలు బాగానే ఉన్నాయి. దిగువ మధ్య తరగతి, సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాల్లోనే అద్దెలు రూ.ఐదారు వేల వరకు ఉంది.

ఏపీ ఆర్థిక కేంద్రం

ఏపీ ఆర్థిక కేంద్రం

విశాఖను ఏపీ ఆర్థిక కేంద్రంగా యాహూ గుర్తించింది. గ్రేటర్ విశాఖగా రూపాంతరం చెందిన తర్వాత ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేక ఎకనామిక్ జోన్లు, ఐటీ సెజ్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటులో పారిశ్రామిక, సేవా రంగాల్లో నెంబర్ వన్‌గా నిలిచిన విశాఖ, తలసరి ఆదాయంలో నెంబర్ 2గా నిలిచింది.

English summary
In what is coming as a heartening news to the citizens of the city, Visakhapatnam has been declared as the 9th richest city in India. The survey, which was conducted by Yahoo! India Finance Team, revealed the list of top 10 richest cities in India in terms of the estimated Gross Domestic Product (GDP) (as of 2016).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X