సీఎం జగన్ చర్చలు సఫలం...సమ్మే విరమించిన 108 ఉద్యోగులు...!
గత నాలుగు రోజులుగా ఏపీ 108 ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మేను విరమించారు. గురువారం సాయత్ర తాడేపల్లి గూడేంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటి 108 ఉద్యోగులు భేటి అయ్యారు. అనంతరం వారి సమస్యలపై చర్చించారు. చర్చలు సఫలు కావడంతో సమ్మేను విరమిస్తున్నట్టు ప్రకటించారు.
Recommended Video


గత సోమవారం నుండి తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో వేతన బకాయిలు చెల్లించడంపై చర్యలు తీసుకోవాలని, దీంతోపాటు 108 వాహానాలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ ఉద్యోగులు సమ్మే బాట పట్టారు. అయితే నాలుగు రోజులుగా సమ్మే కొనసాగిస్తుండడంతో పలు సార్లు అధికారులు వారితో సమావేశమయ్యారు.అయితే సమస్యకు పరిష్కారం లభించలేదు.
చివరగా సీఎం జగన్‌తో ఉద్యోగులు భేటి కావడంతో సమస్యకు పరిష్కారాలపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు. ఈనేపథ్యంలోనే ఈనెల చివరిలోగా బాకాయి పడ్డ వేతనాలు చెల్లిస్తామని సీఎం తెలిపారు. ఇక ఉద్యోగ భద్రత కోసం కూడ పాలసీని తీసుకు వస్తున్నామని సీఎం తెలిపాడు. ఇతర సమస్యలను కూడ అతి త్వరలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హమీ ఇవ్వడంతో గురు వారం రాత్రి నుండే విధులో చేరనున్నట్టు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications