వైసీపీ రెండో జాబితా- 50 మంది సిట్టింగులకు నో టికెట్..?
YS Jagan: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను మార్చడం, కొత్తవారికి బాధ్యతలను అప్పగించడం.. రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదివరకే వైఎస్ఆర్సీపీ తొలి జాబితాను విడుదల చేసింది. రెండో విడత లిస్ట్ విడుదలలో జాప్యం చోటు చేసుకుంటోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ముందుగా అనుకున్నట్లుగా కొద్దిమందితో కాకుండా భారీ స్థాయిలోనే మార్పులు చేయాలని చివరి నిమిషంలో పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోవడమేదీనికి కారణమని తెలుస్తోంది.

వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోండటం, తాను ఆమె వెంటే వెళ్తానంటూ మంగళగిరి సిట్టింగ్ శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించడం.. వంటి పరిణామాలను కూడా వైసీపీ పరిగణనలోకి తీసుకుందని చెబుతున్నారు. షర్మిల రాక ప్రభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని రెండో జాబితాపై కసరత్తు చేసిందని సమాచారం.
తాజాగా రెండో జాబితాపై దాదాపుగా సిద్ధమైనట్టే. మొత్తంగా 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మార్పులు ఉండొచ్చు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో ఈ మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ జాబితా ఈ సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 18, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాపు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకు బలంగా ఉన్న జిల్లాలు ఇవి. ఈ రెండు జిల్లాల్లో జనసేన పార్టీ బల పడిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో- వీటిని ప్రతిష్ఠాత్మంగాతీసుకుంది వైఎస్ఆర్సీపీ.












Click it and Unblock the Notifications