మైనింగ్, ఇసుక బకాసురుడు వెంకటరెడ్డి ఔట్, పెద్దిరెడ్డి జపం, అధికారి కోసం వేట

గత వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్ గా పని చేసిన వెంకటరెడ్డి మీద అధికారులు చర్యలు తీసుకున్నారు. వైసీపీ నాయకులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ఇసుక తవ్వకాలు, ఇసుక విక్రయాలు, ఇసుక టెండర్లు, అగ్రిమెంట్లు మొత్తం ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా వెంకటరెడ్డి వ్యవహరించారని వెలుగు చూడటంతో ఆయన మీద అధికారులు వేటు వేశారు.

నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే వీజీ వెంకటరెడ్డి ఆచూకి చిక్కడం లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించి ప్రవేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా వెంకటరెడ్డి వ్యవహరించారని అధికాకుల విచారణలో వెలుగు చూసింది. వెంకటరెడ్డి వ్యవహారం ఏసీబీకి అప్పగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చివరికి బుధవారం రాత్రి ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

The Andhra Pradesh Government has issued orders suspending the former Director of Mines Venkata Reddy

2019లో వెంకటరెడ్డి డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు ఇండియన్ కోస్టు గార్డ్స్ లో సీనియర్ సివిలియన్ సాఫ్ట్ ఆఫీసురుగా ఉద్యోగం చేస్తున్న వెంకటరెడ్డి అప్పటి వైసీపీ నాయకుల అండతో మొదట విద్యాశాఖలో చేరారు. వెంకటరెడ్డి తనకు ఉన్న పరిచయాలును ఉపయోగించుకుని తరువాత విద్యాశాఖ నుంచి గనుల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.

వైసీపీ నాయకులకు సలామ్ చేస్తూ వాళ్లు చెప్పిన పనులు తూచా తప్పకుండా చేసిన వెంకటరెడ్డిని తరువాత ఏపీఎండీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి గనుల శాఖలో, ఏపీఎండీసీలో వెంకటరెడ్డి చెప్పిందే వేదం అని ఆరోపణలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెంకటరెడ్డిని రెండు పదవుల నుంచి తప్పించింది. వెంకటరెడ్డి నిర్లక్షం కారణంగా ఆంధ్రప్రదేశ్ గనుల శాఖకు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

The Andhra Pradesh Government has issued orders suspending the former Director of Mines Venkata Reddy

వెంకటరెడ్డిని సస్పెండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ ఆయన కేసును ఏసీబీకి అప్పగించారు. అయితే వెంకటరెడ్డి ఆచూకి తెలియడం లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. వేల కోట్ల రూపాయలు బకాలు ఉన్న ప్రైవేట్ కంపెనీల యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి అప్పు లేదని వెంకటరెడ్డి ఆ కంపెనీల యాజమానులకు ఎన్ ఓసీ ఇచ్చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+