Toxic Censor Review: సినిమా టాక్ ఇదే.. హిట్టా..? ఫట్టా..?

కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత యశ్ హీరోగా వస్తున్న చిత్రం 'టాక్సిక్'.. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ ను వేగవంతం చేసింది. టాక్సిక్ చిత్రానికి మహిళా దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు.

ఇక టాక్సిక్ మూవీ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ భారత్ లో 3 గంటల 15 నిమిషాలు ఉంది. అయితే దాన్ని 2 గంటల 54 నిమిషాలకు కుదించారు. ఇండియాలో ఈ సినిమా రన్ టైమ్ సుమారుగా 174 నిమిషాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ రన్ టైమ్ టాక్సిక్ సినిమాకు ప్లస్ అవుతుందా..? లేక మైనస్ అవుతుందా..? అనేది చూడాలి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ వెర్షన్ ను 3 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ వెర్షన్ మూవీని రికార్డు స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Toxic movie review hit or a flop Pan-India star Yash Toxic movie censor review A hit or a flop

సెన్సార్ బృందం ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ వాళ్లు ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. టాక్సిక్ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందన్న విషయం స్పష్టమవుతోంది. ఈ సినిమాలో యశ్ ద్విపాత్రాభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే.. పాజిటివ్, నెగెటివ్ రెండు క్యారెక్టర్లలో కూడా తన నట విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతున్నాయని సెన్సార్ సభ్యులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే కానీ నిజమైతే యశ్ కెరీర్ లోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలోనే టాక్సిక్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఓ మహిళా దర్శకురాలు ఇలాంటి ఏ సర్టిఫికెట్ సినిమా తీసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడం మామూలు విషయం కాదని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ మూవీ ఫుల్ రివ్యూ కోసం ఆగస్టు 26 వరకు ఆగాల్సిందే.. ఇక ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరు 1 మిలియన్ వరకు ఉంది. ఆగస్టు 22 న హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q