వారికి రూ.3వేలు.. బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి జిల్లాలోని రాయల చెరువు కట్ట తెగిన ఘటనలో నష్టపోయిన కుటుంబాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. తిరుపతి జిల్లాలోని కెవిబిపురం మండలంలో గల రాయల చెరువుకు ఇటీవల కాలంలో గండి పడటంతో చోటు చేసుకున్న దుర్ఘటన కారణంగా ఐదు గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి.
రాయల చెరువుకు గండి పడి మునిగిన గ్రామాలు
కళత్తూరు, పాతపాలెం, అరుంధతి వాడ, ఎంఏ రాజుల కండ్రిగ, మహాదేవపురం, కాట్రపల్లి వంటి గ్రామాలు వరద ముంపుతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరదనీరు ఊర్లను ముంచెత్తడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని మేడల పైకి పరుగులు పెట్టారు.

ఎనిమిది గ్రామాలలో ఆస్తి నష్టం
రాయల చెరువు కట్ట బలహీనంగా ఉందని అప్పటికి రైతులు గుర్తించి సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి జాగ్రత్తపడే లోపే గండిపడి ఒక్కసారిగా వరదనీరు గ్రామాలను ముంచెత్తింది. మొత్తం ఎనిమిది అడుగుల మేర వరద నీరు గ్రామాలలోకి చేరడంతో వరద ధాటికి ట్రాక్టర్లు, ఆటోలు, వాహనాలు, పశువులు, ఆరుగాలం కష్టించి సాగుచేసిన రైతుల పంటలు అన్ని వరదలు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
రాయల చెరువు ముంపు బాధితులను ఆదుకోవటానికి ప్రభుత్వ నిర్ణయం
ఈ ఘటనలో ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ విపత్తులో నష్టపోయిన బాధితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వ అధికారులు నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు. సుమారు వెయ్యి కుటుంబాలు నష్టపోయినట్టుగా అంచనా వేసిన అధికారులు ఈ మేరకు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున తక్షణ పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
3.23 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
దీనికోసం మొత్తం 960 కుటుంబాలకు 3.23 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీంతోపాటు వారికి అవసరమైన నిత్యవసర వస్తువులను కూడా అందించనుంది. ఇక రాయల చెరువు గండి బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలను చేపడుతున్న క్రమంలో తక్షణ సాయంగా మూడు వేల రూపాయలను ఇచ్చి రిలీఫ్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications