వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"సినిమా" చూపిస్తున్నారుగా - టిక్కెట్ల ధరలు ఫైనల్ : ప్రభుత్వం టాలీవుడ్ ను ఫిక్స్ చేసేసిందా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులతో..ఇప్పుడు టాలీవుడ్ లబో దిబో మంటోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చట్టంలో మార్పులతో ప్రభుత్వం కొత్త బిల్లు ఆమోదించింది. ఈ మేరకు ఇక నుంచి సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారానే విక్రయించనున్నారు. ధియేటర్ల వద్ద సైతం ప్రభుత్వం డిసైడ్ చేసిన వెబ్ సైట్స్ నుంచే అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ టిక్కెట్ల విధానానికి సినీ ఇండస్ట్రీ పెద్దలు ఓకే చెప్పినా...టిక్కెట్ల ధరల పెంపుకు అనుమతించకపోవటం పైన మాత్రం ఆవేదనతో ఉన్నారు.

ప్రభుత్వం టిక్కెట్ ధరలు అమల్లోకి

ప్రభుత్వం టిక్కెట్ ధరలు అమల్లోకి


భారీ బడ్జెట్ సినిమాలకు అయినా టిక్కెట్ల ధరల పెంపు వెసులుబాటు ఇవ్వాలని పదే పదే కోరుతున్నా.. ప్రభుత్వం మాత్రం సామాన్య ప్రేక్షకుల కోసం ఏ హీరో సినిమా అయినా తమకు ఒక్కటే అని చెబుతోంది. ఈ క్రమంలోనే నో బెనిఫిట్ షోస్, నో ఎక్స్‌ట్రా షోస్, నో టికెట్ హైక్స్.. కేవలం నాలుగంటే నాలుగే ఆటలు..అని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. సినిమా టికెట్ల కొత్త రేట్లను ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఈ రేట్లతో సినిమా నిర్మాతల పరిస్థితి.. థియేటర్ల వ్యవస్థ నష్టపోవటం ఖాయమంటూ చర్చలు మొదలయ్యాయి. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సినిమా టికెట్ల కొత్త ధరల ప్రకారం అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా ప్రకటించారు.

ఏ ప్రాంతాల్లో ధరలు ఎలా

ఏ ప్రాంతాల్లో ధరలు ఎలా

మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో...మల్టీప్లెక్సుల్లో ప్రీమియం రూ.250..డీలక్స్ రూ.150..ఎకానమీ రూ.75 గా నిర్ణయించారు. అదే విధంగా ఏసీ/ఎయిర్ కూల్ ధియేటర్లలో ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40 గా ఫిక్స్ చేసారు. అదే విధంగా..నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20 గా డిసైడ్ అయ్యాయి. మున్సిపాలిటీ ప్రాంతాల్లో...మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150 కాగా, డీలక్స్ రూ.100 , ఎకానమీ రూ.60 గా నిర్ణయించారు. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70 , డీలక్స్ రూ.50 , ఎకానమీ రూ.30 గా ఫిక్స్ అయింది. నాన్ ఏసీ- ప్రీమియం రూ.50 , డీలక్స్ రూ.30 , ఎకానమీ రూ.15 గా నిర్ణయించారు.

ధరల నిర్ణయంపై లబో దిబో

ధరల నిర్ణయంపై లబో దిబో


ఇక, నగర పంచాయతీల్లో...మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120 , డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40 గా ఖరారు అయింది. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35 , డీలక్స్ రూ.25 , ఎకానమీ రూ.15 గా డిసైడ్ చేసారు. నాన్ ఏసీ- ప్రీమియం రూ.25 , డీలక్స్ రూ.15 , ఎకానమీ రూ.10 గా నిర్ణయించారు. గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో...మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.80 , డీలక్స్ రూ.50 , ఎకానమీ రూ.30 గా డిసైడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20 , డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10 గా ఫిక్స్ చేసారు. చివరగా.. ఇవే ప్రాంతాల్లో నాన్ ఏసీ- ప్రీమియం రూ.15 , డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5 గా డిసైడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఈ ధరలతో అసలు సినిమా థియేటర్ల నిర్వహణ కష్టమంటూ యాజమాన్యాలు వాపోతున్నాయి.

Recommended Video

Tomato Price : Indians Google, Sambar Without Tomato || Oneindia Telugu
ప్రభుత్వ నిర్ణయంలో మార్పు ఉంటుందా

ప్రభుత్వ నిర్ణయంలో మార్పు ఉంటుందా

ఇప్పటికే టిక్కెట్ల ధరల పెంపు పైన ప్రభుత్వానికి టాలీవుడ్ ప్రముఖులు అనేక వినతులు చేసారు. అయినా.. ప్రభుత్వం మాత్రం టిక్కెట్లు..బెనిఫిట్ షో ల విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ఈ ధరలతో తామెలా వ్యాపారాలు చేస్తామంటూ వాపోతున్నారు. దీంతో..ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాలా లేక న్యాయస్థానం ఆశ్రయించాలా అనేది తేల్చుకోలేని పరిస్థితుల్లో వారున్నట్లుగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం పైన నేరుగా సీఎంతో చర్చలు చేస్తేనే ఫలితం ఉంటుందని.. టాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు.

English summary
AP Govt finalised movie ticket rates after ammenedement in cinematography act in assembly. Theaters management and Tollywood un happy with govt decision on ticket rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X