నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.వయసు మీరిన నిరుద్యోగులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. త్వరలోనే డీఎస్సీతో పాటుగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడదుల అయ్య అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచింది. యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా రెండు సంవత్సరాలను పెంచింది. ఈ వయోపరిమితి పెంపుదల వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొంత కాలంగా ప్రభుత్వం డీఎస్సీతో పాటుగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ పైన కసరత్తు చేస్తు్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే నిర్ణయం వెలువడుతుండనే అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తాజాగా, పబ్లిక్ సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరిగే రిక్రూట్‌మెంట్ల కోసం అన్ని నాన్ - యూనిఫామ్ సర్వీసుల్లోని పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల కాలంలో రిక్రూట్‌మెంట్లు చేపట్టాలనే అభ్యర్దనలు మొదలయ్యాయి. ఈ సమయంలో ఉద్యోగాల విషయంలో ఒక వైపు కసరత్తు చేస్తూనే..ముందుగా ఈ వయోపరిమితి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వయో పరిమితి పెంపు ద్వారా కొంత కాలంగా ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం నిరీక్షిస్తున్న యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications