వైసీపీలో చేరే ప్రసక్తే లేదు:మంత్రి సోదరుడు బేబినాయన;ఏ పార్టీలో చేరతానో త్వరలోనే చెబుతా: ముత్యాల పాప
విజయనగరం:తాను వైసిపిలో చేరనున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గనులశాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సోదరుడు బేబీనాయన ఖండించారు.
తన అన్నకు, తనకు మధ్య విభేదాలు సృష్టించేందుకే ఎవరో ఈ వదంతులు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మరోవైపు తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని...త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాప చెప్పారు. నర్సీపట్నంలో తాము ఏ పార్టీ నుంచి పోటీ చేస్తామనేది అప్పుడే చెప్పలేమని...ఒకవేళ తాము కోరుకున్న విధంగా టికెట్ రాకుంటే నర్సీపట్నంలో ఈ సారి త్రిముఖ పోటీ తప్పదని ఆమె తేల్చి చెప్పారు.

తాను వైసిపిలో చేరుతున్నట్లు పత్రికలు, టివి ఛానెళ్లు, పోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మంత్రి సుజయకృష్ణ రంగారావు తమ్ముడు బేబీ నాయన ఘాటుగా ప్రతిస్పందించారు. ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవంం లేదన్నారు. తన అన్న మంత్రి రంగారావుకు, నాకు మధ్య విభేదాలు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, కానీ తాను అన్న మాటను జవదాటనని బేబీ నాయన స్పష్టం చేశారు.
తాము పదవుల కోసం కాకుండా, ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికోసం తాము పార్టీ మారామని మున్సిపల్ మాజీ చైర్మన్, రాష్ట్ర గనులశాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సోదరుడు బేబీనాయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఈ వివరణతో కూడిన 20 నిమిషాల వీడియో క్లిప్పింగ్‌ను స్థానిక విలేకరులకు పంపించారు.
2004లోనే తనకు కాంగ్రెస్ నుంచి పోటీకి అవకాశం వచ్చినా వయస్సు చాలలేదని...ఆ క్రమంలో తన అన్న రంగారావు పోటీ చేశారన్నారు. 2009లో తన సోదరుడు రంగారావు తనను ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నారు. కానీ తాను అన్నపై ఉన్న అభిమానంతో 2009, 2014 ఎన్నికల్లో కూడా ఆయననే నిలబెట్టాను తప్ప తాను పదవుల కోసం ఏనాడు ఆశించలేదన్నారు.
2019లో కూడా బొబ్బిలి రాజులు టీడీపీ తరపునే పోటీ చేస్తారని, అదీ తన సోదరుడు సుజయ్ యేనని...వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు నాయకత్వంలో సుజయ్‌కృష్ణరంగారావు బొబ్బిలి నుంచి పోటీ చేస్తారని ఆయన వివరించారు. కొంతమంది వైసీపీ నేతలు తన అభిమానులను, కార్యకర్తలను గందరగోళంలో పడేసేందుకు ఇలాంటి ప్రచారాలు నిర్వహిస్తున్నారని...వీటిని నియోజకవర్గ ప్రజలు నమ్మరాదని ఆయన ఆ వీడియాలో కోరారు
మరోవైపు విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న అభిమానుల నుంచి తాను వచ్చే పోటీ చేయాలన్న తీవ్ర ఒత్తిడి వస్తోందని, వీరందరి సూచనలు, సలహాలు తీసుకుని తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనేది త్వరలోనే వెల్లడిస్తానని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప ప్రకటించారు. శనివారం ఆమె తన భర్త వెంకటరమణమూర్తితో కలిసి అనారోగ్యంతో బాధపడుతున్న మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కామిరెడ్డి కిత్తయ్యను నాతవరంలో పరామర్శించారు.
టీడీపీ నుంచి అయ్యన్నపాత్రుడు, వైసీపీ నుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోందని, మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని విలేకరులు ప్రశ్నించగా ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉందని ముత్యాలపాప తెలిపారు. ఈలోపు చాలా మార్పులు జరుగుతాయని, అప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది చెపుతానని ఆమె వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాతవరం, నర్సీపట్నం, మాకవరపాలెం మండలాల్లో ఐదు వంతెనలు నిర్మించడమే కాకుండా, ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేసినట్టు గుర్తు చేశారు.
తాను పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున తాము ఏ పదవులు ఆశించకుండా ప్రచారం చేస్తే టీడీపీకి సహకరించానని కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు మండలాల్లోనూ తనకు అభిమానులు ఉన్నారని...గతంలో చేసిన సేవలే తనకుగుర్తింపు తెస్తాయని ఆమె వివరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications