క్యాబినెట్ సమావేశం, చంద్రబాబు, పవన్ హాజరు, లిక్కర్ మ్యాటర్ !!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. గురువారం ఉదయం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక విషయాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలలకు కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించే అవకాశం ఉందని తెలిసింది.
పలుప్రతిపాదనలపై చర్చించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. 13 కొత్త మున్సిపాలిటీలో కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై క్యాబినెట్ లో చర్చ జరగనుందని సమాచారం. పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు ఇదే సమావేశంలో మంత్రుల అభిప్రాయాలు తెసుకుంటారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని దేవాలయాలలో పాలక మండళ్ల నియామకాల కోసం చట్ట సవరణ చేసే విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు

దేవాలయల పాలకమండలిలో ప్రస్తుతం 15 మంది సభ్యులు ఉంటున్నారు. 15 మంది నుంచి 17 మందికి పెంచే విధంగా క్యాబినెట్లో చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకుంటానని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని దేవాలయాల్లో పాలక మండలిలో ఇద్దరు బ్రాహ్మణులు ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లోని 1,200 దేవాలయాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారని సమాచారం. అదేవిధంగా పలు అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం త్వరలో అమల్లోకి రానుంది. అయితే కొన్ని జిల్లాలలో అధికార పార్టీకి చెందిన నాయకులు మద్యం వ్యాపారులను బెదిరించి లిక్కర్ షాపుల లైసెన్స్ ల కోసం వారు దరఖాస్తు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించనున్నారని సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు,,మంత్రులు లిక్కర్ వ్యాపారానికి దూరంగా ఉండాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సూచించారని తెలిసింది. గురువారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని ప్రజల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications