వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కోర్టు విచారణకు హాజరుపై- బెయిల్ కండీషన్ల ప్రకారం.. : సీబీఐ కోర్టులో ఏం జరిగింది..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ తన కేసుల్లో విచారణకు హాజరు కాకపోవటం పైన సీబీఐ కోర్టు ప్రశ్నించింది. అసలు విచారణకు రారా అంటూ నిలదీసింది. విచారణ జరుగుతున్న ప్రతీసారీ గైర్హాజరీ పిటీషన్ దాఖలు చేయటం పైన ప్రశ్నలు సంధించింది. హెటిరో, అరబిందోలకు భూకేటాయింపులకు సంబంధించిన కేసుల్లో విచారణ సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ కేసుల్లో జగన్ హాజరుకు సంబంధించి హాజరు మినహా యింపు ఇవ్వాలని న్యాయవాది కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

బెయిల్ కండీషన్ల ప్రకారం హాజరవ్వాలి కదా

బెయిల్ కండీషన్ల ప్రకారం హాజరవ్వాలి కదా

దీంతో న్యాయమూర్తి జగన్ కోర్టు విచారణకు హాజరు పైన ప్రశ్నించారు. జగన్ కోర్టుకు హాజరు కాకపోవటం ఏంటని.. బెయిలు షరతుల ప్రకారం ప్రతి విచారణకు హాజరుకావాలి కదా అంటూ వ్యాఖ్యానించారు. దీనికి జగన్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టు ముందు తన వాదన వినిపించారు. జగన్ నాడు బెయిల్ పొందిన సమయంలో ఎమ్మెల్యే అని..ఇప్పుడు సీఎం గా ఆయన పైన రాజ్యంగ బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. గతంలో వారంలో ఒక్క రోజు మాత్రమే విచారణ ఉండేదని గుర్తు చేసారు. ప్రస్తుత విచారణలో భాగంగా వారంలో అయిదు రోజుల పాటు విచారణ జరుగుతోందని గుర్తు చేసారు.

సీఎంగా పాలనా వ్యవహారాలతో బిజీగా

సీఎంగా పాలనా వ్యవహారాలతో బిజీగా


గతంలో ఎంపీగా..ఎమ్మెల్యేగా ఉండేవారని..ఇప్పుడు సీఎంగా పాలనలో బిజీగా ఉండటంతో కేసు విచారణ కోసం వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినిహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇక, ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాలతో పాటుగా ప్రోటోకాల్.. భద్రతా పరమైన సమస్యలు ఎక్కువగా ఎదురువతున్నాయని కోర్టుకు నివేదించారు. సీఎం గా ఆయన్ను కలిసేందుకు కోర్టు కు ఎక్కువ మంది వస్తారంటూ కోర్టును విన్నవించారు. హాజరు తప్పనిసరని ఆదేశిస్తే హాజరవుతారంటూ జగన్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

హైకోర్టులో తీర్పు రావాల్సి ఉందంటూ

హైకోర్టులో తీర్పు రావాల్సి ఉందంటూ


వ్యక్తిగత హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించామని, దీనిపై తీర్పు రావలసి ఉందని చెప్పారు. హాజరు మినహాయింపుపై అక్కడ స్టే కోరగా ఇక్కడ పెండింగ్‌ విషయాన్ని సీబీఐ కోర్టులో చెప్పాలందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలని సీబీఐ కోరుతోందన్నారు.ఇదే విషయాన్ని మెమోగా దాఖలు చేయాలని ఆదేశించడంతో జగన్‌ తరఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు. హైకోర్టులో పెండింగ్‌ కేసు వివరాలను మెమోలో పేర్కొన్నారు.

లేపాక్షీ కేసుల్లోనూ విచారణ

లేపాక్షీ కేసుల్లోనూ విచారణ


ఇక, జగన్ కేసులకు సంబంధించి లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసులో ఏ-12గా ఉన్న ఐఏఎస్‌ అధికారి మురళీధర్‌రెడ్డి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. పిటిషనర్‌ తరఫున న్యాయవాది శివరాజు శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను ప్రాసిక్యూట్‌ చేయరాదన్న నిబంధనలను సీబీఐ ఉల్లంఘించిందన్నారు. మురళీధర్‌రెడ్డిని విచారించేందుకు ప్రభుత్వం అనుమతించలేదని పేర్కొన్నారు. ఈ కేసులో జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌, జనని ఇన్‌ఫ్రాలు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లలో కౌంటరు దాఖలు చేయడానికి సీబీఐ గడువు కోరడంతో సీబీఐ కోర్టు విచారణను జనవరి 4కు వాయిదా వేసింది.

English summary
The CBI court questioned Chief Minister Jagan's failure to appear for trial in his cases, commenting on whether he should attend every hearing as per the bail conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X