సీఎం జగన్ నిర్ణయం రోల్ మోడల్ గా - పెన్షన్ పై కేంద్రం కీ డెసిషన్..!!

కేంద్రం ఉద్యోగుల పెన్షన్ విధానంలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా సీపీఎస్ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ తరహాలో నిర్ణయానికి కేంద్రం సిద్దమవుతోంది. చాలా కాలంగా పలు రాష్ట్రాల్లో ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేయాలి..పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో కేంద్రం జాతీయ పెన్షన్ విధానంలో సవరణలకు సిద్దమైంది.

Recommended Video

    CM Jagan నిర్ణయాన్ని ఫాలో అవుతున్న కేంద్రం... | Telugu OneIndia

    సీపీఎస్ రద్దు డిమాండ్ వేళ
    సీపీఎస్ రద్దు చేయాలనేది చాలా రాష్ట్రాల్లో వినిపిస్తున్న డిమాండ్. ఏపీలోనూ కొద్ది రోజుల వరకూ ఇదే డిమాండ్ పైన చర్చలు జరిగాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల డిమాండ్‌పై సానుకూలంగా స్పందిస్తున్నాయి. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్ గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌ ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి.

    రెండేళ్ల కాలంగా ఏపీ ప్రభుత్వం సీపీఎస్ రద్దు డిమాండ్ పైన చర్చలు చేసింది. ఉద్యోగులకు..ప్రభుత్వానికి నష్టం లేకుండా కీలక ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. తాజా నిర్ణయం మేరకు ఉద్యోగి పదవీ వివరణ చేసే సమయంలో చివరి జీతంలో 50 శాతం పెన్షన్ అందేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

     CM Jagan

    పెన్షన్ పథకంలో సవరణలు
    ఇప్పుడు కేంద్రం జాతీయ పెన్షన్ పథకంలో సవరణల దిశగా కొత్త అల్గారిథమ్‌తో ముందుకు వచ్చింది. దీంతో.. ఉద్యోగవర్గాలను సంతృప్తి పరుస్తూనే.. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను ఇరకాటంలోకి నెట్టే విధంగా కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2004 వరకు ప్రభత్వ ఉద్యోగి పెన్షన్ పొందేందుకు ఎలాంటి చెల్లింపులు అవసరం ఉండేది కాదు.

    2004లో అప్పటి సర్కారు పాత పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి.. సీపీఎ్‌సను తెరపైకి తెచ్చింది. సీపీఎస్ లో ఉద్యోగి మూల వేతనంలో 10 శాతం.. ప్రభుత్వం 14 శాతం వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి చివరి జీతంలో తీసుకున్న వేతనంలో 38 వాతం వరకు పెన్షన్ పొందేలా సీపీఎస్ రూపొందించారు. దీనిని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.

     CM Jagan

    పెన్షన్ పెంచేలా కసరత్తు
    ఇప్పుడు ఉద్యోగులకు మేలు చేసేలా మార్పుకు కేంద్రం సిద్దమైనట్లు సమాచారం. అందులో భాగంగా ఉద్యోగులకు ఇప్పుడు ఇస్తున్న చివరి జీతంలో 38 శాతం వరకు పెన్షన్ గా అందుతున్న మొత్తాన్ని 40 నుంచి 45 శాతం వరకు పెంచాలనే కేంద్రం ప్రతిపాదనగా తెలుస్తోంది. దీని ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగికి లబ్ది చేకూరుతుందని కేంద్రం భావిస్తోంది.

     CM Jagan

    కేంద్రం తాజా నిర్ణయం అమల్లోకి వచ్చిన వెంటనే.. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఈ విధానం వర్తిస్తుంది. రాష్ట్రాల ఉద్యోగులకు ఆయా రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు వెంటనే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశాలుంటాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి గ్యారెంటీ పెన్షన్ స్కీం 2023 ముసాయిదాకు ఆమోదం తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+