చంద్రబాబు, పవన్ టార్గెట్ వీళ్లే ?, వీళ్ల శాఖల్లో ఎన్ని రూ. వేల కోట్లు అక్రమాలు జరిగాయి ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు త్వరలో ప్రమాణస్వీకారం చెయ్యడానికి సిద్దం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుతీరడానికి కౌంట్ డౌన్ మొదలైయ్యింది. ఇదే సందర్బంలో ఇంతకాలం జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొంత మంది వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిసింది.
వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ నాయకులు మంత్రులుగా పని చేశారు. వారిలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, అనీల్ కుమార్ యాదవ్, ఆర్ కే రోజా, గుడివాడ అమర్నాథ్ తదితరులు ఉన్నారు. ఈ మంత్రులు ఏఏ శాఖలు అప్పగించారు. ఒక్కో శాఖకు వైసీపీ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించింది అని ఆరా తియ్యాలని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సిద్దం అవుతున్నారని తెలిసింది.

వైసీపీ ప్రభుత్వంలో ఏఏ శాఖలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లు ఎవరు, అసలు పనులు చేశారా అని మొత్తం బయటకులాగాలని కూటమి ప్రభుత్వం సిద్దం అవుతోందని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం త్వరలో కొలువు తీరుతున్న సందర్బంగా వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, అనీల్ కుమార్ యాదవ్, ఆర్ కే రోజా, గుడివాడ అమర్నాథ్ తదితరుల మంత్రులుగా ఉన్న సమయంలో వారి శాఖల్లో పని చేస్తున్న అధికారులు హడలిపోతున్నారని తెలిసింది.

వైఎస్ జగన్ హయాంలో పని చేసిన మంత్రులు అభివృద్ధి పేరుతో ఎంత మింగేశారు అని వాస్తవాలు తెలుసుకోవాలని టీడీపీ, జనసేన నాయకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందు డిమాండ్ చెయ్యడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనేక ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అలాగే పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే.
ఇలా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓటమికి శక్తివంచనలేకుండా పని చేసిన పెద్దిరెడ్డిని చంద్రబాబు, పవన్ కల్యాణ్ టార్గెట్ చేసే అవకాశం ఉందని తెలిసింది. జగన్ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి ఐదు సంవత్సరాలు మంత్రిగా పని చేశారు. ఇక అంబటి రాంబాబు, ఆర్ కే రోజా, అనీల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ కథ కూడా చూడాలని చంద్రాబాబు, పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నారని తెలిసింది. మొత్తం మీద ఈ నాయకుల శాఖల్లో పని చేస్తున్న అధికారులు ఇప్పుడు కొత్త ప్రభుత్వం అడగబోయే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలని ప్రజలు అంటున్నారు.












Click it and Unblock the Notifications