ప్రజా వేదిక వస్తువులను వేలం వెయ్యనున్న సీఆర్డీఏ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా వేదిక కూల్చివేసిన విషయం తెలిసిందే .అప్పట్లో చంద్రబాబు నివాసానికి పక్కనే ఉన్న ప్రజా వేదిక అక్రమ నిర్మాణం అని కూల్చివేసింది ఏపీ సర్కార్ . ప్రభుత్వ కార్యాకలాపాలకువినియోగించుకోవాలని పలువురు సూచించినా సరే అవేవీ వినకుండా అక్కడ ఉన్న ఫర్నీచర్ అంతా తరలించి ప్రజావేదికను కూల్చి వేసి అక్రమ కట్టడాలను తొలగిస్తామని తేల్చి చెప్పింది.
ఇక తొమ్మిది నెలల క్రితం కూల్చేసిన ప్రజావేదిక నుండి తరలించిన సామాగ్రిని వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదికను 9 నెలల క్రితం అధికారులు కూల్చివేసిన సమయంలో అక్కడ ఉన్న కూలర్లు, ఏసీలు, ఫర్మీచర్ ను అక్కడ నుండి తరలించారు. ఇక ప్రజా వేదికకను అనుమతుల్లేవంటూ దాన్ని వెంటనే తొలగించాలని సీఎం జగన్ ఆదేశించిన మేరకు సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు.

అప్పటి నుండి పక్కన పడేసిన ఏసీలు, కూలర్లు, ఫర్మీచర్, ఇంకా కొన్ని ఉపయుక్త పరికరాలను చివరకు వేలం వేయాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ఇక వాటిని వేలంలో కొనుగోలు చెయ్యాలనుకున్న వారు మార్చి 3వ తేదీలోగా వేలం పత్రాలను సీఆర్డీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని, వేలానికి దరఖాస్తు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రజావేదిక ఫర్నీచర్, సామాగ్రి వేలం నిర్వహించనున్నారు.
Recommended Video

-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications