విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారతదేశానికి విదేశాలతో కంటే బిజెపితోనే ప్రమాదం...అదే నిదర్శనం:సిపిఐ నారాయణ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:భారత దేశానికి, దేశ భద్రతకు విదేశాల నుంచి కంటే దేశంలోని బిజెపియే ప్రమాదకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. విశాఖలోని అల్లిపురం సిపిఐ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని కె.నారాయణ విమర్శించారు. దేశ భద్రత తీవ్ర ముప్పులో పడిందని, ఇటీవల నలుగురు న్యాయమూర్తులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మీడియాకెక్కిన ఉదంతమే తెలియజేస్తుందని విశ్లేషించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో దేశవ్యాప్తంగా బిజెపి విధానాలపై నాలుగు జాతాల ద్వారా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

The danger to India is with the BJP:CPI Narayana

గుజరాత్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను 15 రోజులు వాయిదా వేస్తూ హుకుం జారీచేయడం ఏం ప్రజాస్వామ్యమని, ఇవి నియంతృత్వ పోకడలు కావా అని ప్రశ్నించారు.
నోట్ల రద్దు వల్ల ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఆగలేదని, జిఎస్‌టి వల్ల సామాన్యులపై భారం పడకుండా ఆగలేదని, ఎవరి ప్రయోజనాల కోసం మోడీ ఈ పనులు చేశారో క్రమంగా వెల్లడవుతూ వస్తోందని నారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కెసిఆర్‌ నేతృత్వంలో ఏర్పడిన ఫెడరల్‌ ఫ్రంట్‌ మోడీకి భజన చేసేందుకేనని నారాయణ ఆరోపించారు. కెసిఆర్ పోకడలు చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలన్నీ ఢిల్లీ బాట పట్టాయని...మోడీని వ్యతిరేకించే వారు...మోడీకి అనుకూలంగా ఉండేవారుగా రాజకీయ పార్టీలు తయారయ్యాయని నారాయణ ఎద్దేవా చేశారు.రాష్ట్రంలోని దేవాలయాల్లో క్షౌరవృత్తిదారులు వారి సమస్యలపై చేపడుతున్న సమ్మెను విరమించేలాగ రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని నారాయణ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, మార్స్కిస్ట్‌ అధ్యయన కేంద్రం సంయుక్తాధ్వర్యాన శనివారం విశాఖ పౌర గంధ్రాలయంలో ఎడ్వర్డ్‌ ఏవలింగ్‌ రచించిన 'ది స్టూడెంట్స్‌ మార్స్క్‌' ఆంగ్ల పుస్తకాన్ని నారాయణ ఆవిష్కరించారు. దోపిడీ సమాజం ఉన్నంతవరకూ మార్స్కియిజం అజేయంగానే ఉంటుందని ఈ సందర్భంగా నారాయణ తెలిపారు.

English summary
Visakhapatnam:CPI National Secretary Narayana said that India is facing a threat from the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X