పెద్దిరెడ్డి ఫ్యామిలీని జిల్లా నుంచి బహిష్కరించండి, దెయ్యాలు వేదాలు చెబితే?, టీడీపీ
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుటుంబం మీద రానురాను వ్యతిరేకత పెరిగిపోతా ఉంది. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు ఆయన కుటుంబాన్ని చిత్తూరు జిల్లా నుంచి బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తో పాటు టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
చిత్తూరులో మీడియాతో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, చిత్తూరు లోక్ సభ నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి కోదండరామ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో గత ఐదు సంవత్సరాలు పాటు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆరాచకాలు చేశారని ఆరోపించారు.

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు ఆయన అనుచరుల కారణంగా వేలాది మంది టీడీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఒక్క పుంగనూరు నియోజక వర్గంలోనే సుమారు రెండు వేల మంది అమాయకుల మీద కేసులు పెట్టించి వారిని జైలుకు పంపించారని, ఆ పాపాలు అన్ని పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులవే అని టీడీపీ సీనియర్ నాయకులు సప్తగిరి ప్రసాద్, కొదండరామ్ ఆరోపించారు.
దెయ్యాలు వేదాలు వెళ్లించినట్లు రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజ్యంగా గురించి మాట్లాడుతున్నారని, వీళ్లు నీతులు మాట్లాడుతుంటే చిన్న పిల్లలు కూడా నవ్వకుంటున్నారని సప్తగిరి ప్రసాద్ వ్యంగంగా అన్నారు. చెయ్యవలసిన అరచకాలు అన్నీ చేసేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని, చిత్తూరు జిల్లాలో రాజ్యంగం గురించి మాట్లాడే నైతిక హక్కు పెద్దిరెడ్డి కుటంబానికి లేదని టీడీపీ నాయకులు ఆరోపించారు
వైసీపీ ప్రభుత్వం పతనం అయిన తరువాత అధికారం దూరం కావడంతో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన కుటుంబం ఆ విషయం జీరి్ణించుకోలేకపోతున్నారని, చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతలు సవ్యంగా ఉండాలంటే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన కుటుంబాన్ని చిత్తూరు జిల్లా నుంచి బహిష్కరించాలని టీడీపీ నాయకులు సప్తగిరి ప్రసాద్, కోదండరామ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనవి చేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాజకీయ జీవితం ఇంతటితో ముగిసిపోయిందని, ఆయన బాదితులు అందరూ ఒక్కటి అవుతున్నారని, పుంగనూరు ప్రజలు కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని క్షమించరని సప్తగిరి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటనకు వెళ్లాలని ప్రయత్నిస్తే అక్కడ శాంతి భధ్రతలకు ఇబ్బంది వస్తుందని ఆయన్ను తిరుపతిలోనే హౌస్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications