ఆ జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టాలి... ఏపీ సర్కార్ కు ఏఎన్నార్ అభిమానుల సంఘం విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రగడ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం తీసుకోవడంతో 13 జిల్లాలు కాస్త ఇప్పుడు 26 జిల్లాలుగా సరికొత్త రూపాన్ని సంతరించుకోనున్నాయి. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వివాదాలు నెలకొన్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై కొన్నిచోట్ల అభ్యంతరాలు వినిపిస్తుండగా, మరికొన్ని చోట్ల జిల్లాల పేర్ల విషయంలో కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అక్కినేని పేరు ఆ జిల్లాకు పెట్టాలని డిమాండ్
తాజాగా సినీ పరిశ్రమకు చెందిన లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరు కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో తెరమీదకు వచ్చింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడుతున్న కొత్త జిల్లా అయిన మచిలీపట్నానికి దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని అక్కినేని అభిమానుల సంఘం నేతలు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం తమ కోరికను దృష్టిలో పెట్టుకొని ఏఎన్ఆర్ జిల్లాగా జిల్లా పేరును పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అక్కినేని నాగేశ్వరావు గుడివాడ రామాపురంలో జన్మించారని, ఆయన గుడివాడ ప్రాంతానికి చెందిన వారని, తెలుగు సినీ పరిశ్రమను ఉర్రూతలూగించిన గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వర రావు అని వారు పేర్కొన్నారు.

అక్కినేని సినీ పరిశ్రమలో చేసిన సేవలకు గుర్తింపుగా జిల్లాకు పేరు పెట్టండి
మద్రాసు నుంచి హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమను తీసుకు వచ్చే విషయంలో ఎంతో కృషి చేశారని అక్కినేని అభిమానుల సంఘం నేతలు పేర్కొంటున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఏఎన్ఆర్ ఎంతో ఖ్యాతి గడించారని, సినీ రంగంలో ఆయన చేసిన సేవకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయన అందుకున్నారని అటువంటి ఆయనకు గుర్తింపుగా జిల్లాకు పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఏఎన్ఆర్ విద్యా, సామాజిక సేవలలో ఎంతో తోడ్పాటు నందించారని వారు కితాబిచ్చారు.

మచిలీపట్నం జిల్లాకు అక్కినేని పేరు ..అక్కినేని అభిమానుల సంఘం నేతలు
తెలుగువారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన మహావ్యక్తి అక్కినేని నాగేశ్వర్ రావ్ అని పేర్కొని, ఏఎన్నార్ కళా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ అక్కినేని అభిమానుల సంఘం నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేయబోతున్న విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది. ఏపీలో జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకురాలు పురంధరేశ్వరి తదితరులు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.
Recommended Video

ఎన్టీఆర్ జిల్లాగా విజయవాడ ... అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కొందరు నేతలు
ఇక ఇదే సమయంలో విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉంది. అంటే కొత్తగా ఏర్పడబోయే కృష్ణా జిల్లాలో ఉంటుంది.
అప్పుడు కొత్తగా ఏర్పడబోయే జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాలి కానీ, ఎన్టీఆర్ పేరును విజయవాడకు పెట్టడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పేర్ల విషయంలోనూ, జిల్లా కేంద్రాలు ఏర్పాటు విషయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. కొత్త కొత్త డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications