ఈవీయంల పై డ్రామా.. పనిచేస్తున్నాయంటున్న వైసీపి..! లేదంటున్న టీడిపి.. అసలేం జరుగుతోందక్కడ..!?

Recommended Video

    Lok Sabha Elections 2019 : EVMలు పనిచేస్తున్నాయంటున్న వైసీపి లేదంటున్న టీడిపి || Oneindia Telugu

    అమరావతి/హైదరాబాద్ : ఏపిలో ఎన్నికల పోలింగ్ అత్యంత ఉత్కంఠ పరిస్థితుల మద్య జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈవీయంల యంత్రాలను ద్వంసం చేస్తుంటే మరికొన్ని చోట్ల ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని పరస్పరం నాయకులు ఆరోపించుకుంటున్నారు. ఇక పోలింగ్ బూత్ లలో ఈవీయం యంత్రాలు మొరాయిస్తున్నాయని, సరిగా పనిచేయడం లేదని అదికార పార్టీ నేతలు అంటుంటే.. అదేం లేదు సరిగానే పనిచేస్తున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే ఈవీయం యంత్రాల పనితీరు సరిగా లేదనే వంకతో పోలింగ్ కు అంతరాయం కలిగించాలని టీడిపి ఉద్దేశంగా కనిపిస్తోందని వైసిపి నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి ఆరోపిస్తున్నారు.

    The drama on these EVMs..!Not working says ycp, no,no working says tdp..!whats happening..!!

    ఇదిలా ఉండగా ఈవీయంలు సరిగా పనిచేయని చోట రీపోలింగ్ నిర్వహించాలని ఏపీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదికి చంద్రబాబు లేఖ రాయడం గమనార్హం.30శాతం ఈవీఎంలు పనిచేయకపోవడంతో మూడు గంటల సమయం వృధా అయిందని బాబు ఆవేదన వ్యక్తం చేసారు. అంతే కాకుండా ఈవీఎంల పనితీరుపై ఓటర్లు ఆందోళనలో ఉన్నారని చంద్రబాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపి మాజీ ఎంపి వైవీ సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రజల్ని తప్పు దోవపట్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఈవీఎంలు పనిచేయడంలేదన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా 157 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశం పై ఈసీకి వినతిపత్రం అందజేసారు న టీడీపీ ప్రతినిధులు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+