శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్: నేటి నుంచి..

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. శుక్రవారం నాడు 65,080 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,394 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.80 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 17 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

The entry for the devotees into the Pushkarini in Tirumala resume from today

అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.

4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని నెల రోజుల పాటు మూసివున్న శ్రీవారి ఆలయ పుష్కరిణిని నేటి నుంచి పునరుద్ధరించనున్నారు టీటీడీ అధికారులు. భక్తుల కోసం అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ఇదివరకు నెలరోజుల పాటు దీన్ని మూసివుంచిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసి ఉంచారు. భక్తులు ఎవరికీ ప్రవేశం కల్పించలేదు. పుష్క‌రిణి హార‌తి కార్యక్రమాన్ని రద్దు చేశారు.

ఈ నెల రోజుల పాటు వార్షిక నిర్వహణ పనులను చేపట్టారు. ఇందులో భాగంగా- పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించారు. టీటీడీ వాటర్‌వర్క్స్‌ విబాగానికి చెందిన దాదాపు 100 మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడ్డారు. స్వామి పుష్కరిణి శుద్ధి కార్యకమ్రాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు బంగారు రంగు వేసి, శోభాయమానంగా తీర్చిదిద్దారు.

దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపారు. మరమత్తు పనులు పూర్తిచేశారు. శనివారం నాటికి ఈ పనులన్నీ కూడా పూర్తి కావడంతో పుష్కరిణిని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. భక్తులను పుష్కరిణిలోనికి అనుమతించనున్నారు. పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని మళ్లీ చేపట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+