జగన్ ప్రయోగాలు రివర్స్, రిజిస్ట్రేషన్లు ఏమోకాని పరువు మాత్రం పోయింది
గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రయోగాత్మకంగా సచివాలయాల్లో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ సచివాలయాలు ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం కొత్త ప్రయోగాలు చేపట్టింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కాకుండా గ్రామ సచివాలయంలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, ఇక ప్రజల కష్టాలు పూర్తిగా తీరిపోతాయని అప్పట్లో వైయస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పింది.
గ్రామ సచివాలయాల్లో రెండున్నర ఏళ్ల క్రితం ఆస్తుల రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వకుండా, సచివాలయాల్లో అరకొర సదుపాయాలు కల్పించి గ్రామ సచివాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. అయితే అప్పట్లో వైయస్ జగన్ చేపట్టిన ప్రయోగాలకి గ్రామ సచివాలయంలోని ఉద్యోగులపై ఒత్తిడి తప్పా ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రయోగం ఎలాంటి ఫలితం ఇవ్వలేదు.

గత రెండున్నర ఏళ్ల కాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం 110 ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి రీ సర్వేలో తర్వాత 67 సచివాలయంలో మాత్రమే ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలు అమలు చేశారు. అయితే అనేక సమస్యలతో సచివాలయం ఉద్యోగులు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అతి కష్టం మీద పలు గ్రామ సచివాలయాల్లో కొన్ని రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న సాఫ్ట్ వేర్ కు బదులుగా వైయస్ జగన్ ప్రభుత్వంలో కొత్త సాఫ్ట్ వేర్ ఉయోగించారు.
కొత్త సాఫ్ట్ వేర్ సర్వర్ లో సాంకేతిక సమస్యలు తలఎత్తడంతో సరైన సమయంలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చెయ్యలేక అక్కడి ఉద్యోగులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజు లేఖర్లతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తామని అప్పట్లో వైయస్ జగన్ ప్రభుత్వం పదేపదే ప్రతి మీటింగ్ లో, సమావేశాల్లో గొప్పగా చెప్పుకుంది.

అయితే అదే దస్తావేజు లేఖర్లు లేకుండా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడటంతో వైసీపీ నాయకులతో పాటు గ్రామ సచివాలయం ఉద్యోగులు అప్పట్లో ప్రజలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. రెండున్నర ఏళ్ల సమయంలో చిత్తూరు జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో కేవలం 110 ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగడం విశేషం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లను పూర్తిగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications