విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ గ్యాస్ అత్యంత ప్రమాదకరం: ఇప్పుడే కాదు..బాధిత ప్రజల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం

|
Google Oneindia TeluguNews

విశాఖనగరంలోని ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్ కెమికల్ ఇండస్ట్రీ నుండి లీకైన రసాయన వాయువు ప్రమాదకరమైనదని విశాఖ కేజీహెచ్‌ వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రానికి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్యులు భావిస్తున్నారు.. ప్రస్తుతం వెలువడిన గ్యాస్ ప్రభావం స్వల్ప కాలంలోనే కాదు దీర్ఘ కాలంలో కూడా బాదితులపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు .

భయంకరమైన విష వాయువుగా చెప్తున్న వైద్యులు

భయంకరమైన విష వాయువుగా చెప్తున్న వైద్యులు

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ తో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఆర్‌.ఆర్‌.వెంకటాపురంతో పాటు, బీసీ కాలనీ , విశాఖ 66వ వార్డుపై విషవాయువు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సుమారు 300 మంది తీవ్రమైన గాఢత కలిగిన విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైనట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. మృతులు, బాధితుల్లో ఎక్కువ మంది ఆర్‌.ఆర్‌.వెంకటాపురం వాసులే ఉన్నారని ఆయన పేర్కొన్నారు .

మాడిపోయిన చెట్లు .. మూగజీవాలతో సహా మృతి

మాడిపోయిన చెట్లు .. మూగజీవాలతో సహా మృతి

గ్యాస్‌ లీకైన ప్రాంతంలో పరిస్థితి అదుపులోకి తీసుకురావటానికి అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మున్సిపల్‌ సిబ్బంది గ్యాస్ ప్రభావాన్ని తగ్గించే రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. ఇక వెలువడుతున్న గ్యాస్ ఎంత తీవ్రమైనదంటే గ్యాస్‌ ప్రభావానికి గ్రామాల్లోని చెట్లన్నీ మాడిపోయాయి. విషవాయువు పీల్చిన మూగజీవాలు నురగలు కక్కుతూ చనిపోయాయి . గ్యాస్‌ ప్రభావానికి ఉక్కిరి బిక్కిరి అయిన స్థానికులు ఎటు వెళ్తున్నారో కూడా తెలియకుండా పరుగులు తీసి, ఎక్కడి వారు అక్కడే కుప్ప కూలారు. కొందరు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

Recommended Video

Vizag Gas Leak : LG Polymers Company Is The Main Culprit Behind Vizag Gas Tragedy
 స్వల్ప కాల .. దీర్ఘ కాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్న వైద్య నిపుణులు

స్వల్ప కాల .. దీర్ఘ కాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్న వైద్య నిపుణులు

ఎల్జీ పాలిమర్స్ నుండి లీకైన అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ ప్రజల ఆరోగ్యం పై దుష్ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. కళ్ళు మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఉదరసంబంధమైన ఇబ్బందులు ఇవి స్వల్ప కాల సమస్యలని చెప్తున్నారు. ఇక లాంగ్ టర్మ్ విషయానికి వస్తే నాడి వ్యవస్థపైనా, మూత్రపిండాలపైనా దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు. బలహీనత, క్యాన్సర్, తలనొప్పి, డిప్రెషన్ వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ రకాల దీర్ఘ వ్యాధులతో బాధ పడేవారికి ఈ విష వాయువు అత్యంత ప్రమాదం కలిగిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

English summary
Medical experts say the LG polymers gas leakage has an adverse effect on people's health. Experts say short-term and long-term effects are likely. Eyes burning, skin rash, shortness of breath, and abdominal problems are some of the short-term problems. When it comes to the long term, it is said to have an effect on the nervous system and kidneys. There are many problems, such as weakness, cancer, headaches and depression.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X