Srisailam: భారీ వరద.. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఓపెన్ ..
కృష్ణా నదిలో వరద ప్రవాహ కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణా నదిలో భారీగా వరద వస్తోంది. శ్రీశైలంకు భారీ వరద రావడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు పంపుతున్నారు. పది అడుగుల మేర గేట్లను ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ కు పంపుతున్నారు. 55 వేల 605 క్యూసెక్కులు క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 6744క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
అధికారులు 6, 7, 8వ గేట్లను ఎత్తారు. ఒక్కో గేటు నుంచి 27వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 135.7816టీఎంసీలు టీఎంసీలు ఉన్నట్లు వివరించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 512.40అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల అధికారులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా నీటిని వదులుతున్నారు. మరోవైపు గోదావరి బేసిన్ పైన వరద సరిగా లేదు. కానీ మేడిగడ్డ కింది నుంచి వరద కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ నామ మాత్రంగానే వరద వస్తోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది పంపుహౌస్‌లోని నాలుగు మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల ప్రవాహం నందిమేడారం రిజర్వాయర్‌లోకి పంపుతున్నారు.
అక్కడ నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంపుహౌస్‌కు చేరిన తర్వాత ఈ నీటిని నాలుగు మోటార్ల ద్వారా వరద కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. ఈ కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీరు వెళ్తోంది. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 17 టీఎంసీల నీరు నిల్వ ఉంది.












Click it and Unblock the Notifications