ఏపీకి ఆ నిర్ణయం గేమ్ ఛేంజర్ - పవన్, లోకేష్ చర్చలు..!!
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. విజయవాడలో ఘనతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ కీలక ప్రసంగం చేసారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. విజన్ 2047 కి పది సూత్రాల ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతి గ్రామం ప్రతి వర్గం లో అభివృద్ధి ఉండాలినే తమ లక్ష్యమని చెప్పారు. పేదరికం లేని సమాజం పై దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. గోదావరి - పెన్నా అనుసంధానం చేస్తామని చెప్పిన గవర్నర్..2026 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఏపీకి గేమ్ ఛేంజర్
రిపబ్లిక్ డే ప్రసంగంలో గవర్నర్ కీలక అంశాలను ప్రస్తావించారు. ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా చెప్పుకొచ్చారు. కోస్తా తీరాన్నిఅంతర్జాతీయ సరిహద్దు గా సమన్వయం చేసుకు ని అభివృద్ధి పై దృష్టి పెడతామని వెల్లడించారు. నదుల అనుసంధానం గురించి వివరించారు. గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్ వరద జలాల ఆధారంగా నిర్మాణం చేపడతామని.. ఈ నిర్ణయం ఏపీకి గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి పై ప్రధానంగా దృష్టి పెట్టిందని వివరించారు. పేదరికం లేకుండా చేయడమే ప్రధాన కర్తవ్యంగా గవర్నర్ పేర్కొ న్నారు. ప్రతి కుటుంబంలో ఒక ఎంట్రప్రెన్యూర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జనవరి 8 నాటికి 17040 గ్రామాల్లో రెవిన్యూ సదస్సు లు నిర్వహించామని గవర్నర్ పేర్కొన్నారు. వాట్సప్ ద్వారా 150 సర్వీసులు అందిస్తామని ప్రకటించారు.

పవన్ - లోకేష్ మంత్రాంగం
2047 నాటికి 15 శాతం గ్రోత్ సాధిస్తామని గవర్నర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో అప్పుల భారం ఎక్కువగా ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విావరించారు. స్వర్ణాంధ్ర 2047కు ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నామని వివరించారు. సాంకేతి క వృత్తి పరమైన నైపుణ్యాలను పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం ఏపి అభివృద్ధిలో కూడా సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డీయే కూటమి ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందని గవర్నర్ భరోసా ఇచ్చారు. రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్ - మంత్రి లోకేష్ మధ్య మంత్రాంగా సాగింది. కీలక అంశాలు ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య సాగిన సంభాషణ ఇప్పుడు ప్రభుత్వ - రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications