వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చిన హైకోర్టు ..ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనపై కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వ తీరుపై మరోసారి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది . తమకు ఇష్టమైన మాధ్యమాన్ని ఎంచుకునే హక్కు విద్యార్థులకు ఉందని హైకోర్టు పేర్కొంది . విద్యార్థులను ఇంగ్లీష్‌ మీడియం పేరుతో నిర్బంధిస్తే కుదరదని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీలో ఆరో తరగతి వరకు నిర్బంధంగా ఇంగ్లిష్‌ మీడియాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దాఖలైన పిటీషన్ పై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

పంచాయితీలకు వైసీపీ రంగులు తొలగించండి .. వైసీపీ సర్కార్ కు షాక్ ఇచ్చిన హైకోర్టుపంచాయితీలకు వైసీపీ రంగులు తొలగించండి .. వైసీపీ సర్కార్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు

 ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనే సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్

ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనే సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్

ఏపీలో ప్రభుత్వం తెలుగు మీడియం ను ఎత్తివేసి ఇంగ్లీష్ మీడియం విద్యాబోదనను అమలు చెయ్యాలని ప్రయత్నిస్తుంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యామాన్ని తీసివేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనే సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస్ అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు . ఇక తెలుగు మీడియం కు బదులు ఇంగ్లీష్ మీడియం అమలుకు ముందుకు వెళ్తున్న సర్కార్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుందని పిటీషనర్ పేర్కొన్నారు.

 ఇంగ్లిష్‌ మీడియంలోనే విద్యార్థులు చదవాలని నిర్బంధించలేమన్న హైకోర్టు

ఇంగ్లిష్‌ మీడియంలోనే విద్యార్థులు చదవాలని నిర్బంధించలేమన్న హైకోర్టు

ఇక దీనిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంగ్లిష్‌ మీడియంలోనే విద్యార్థులు చదవాలని నిర్బంధించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. అలా చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరించడమే అని స్పష్టం చేసింది.ఇంగ్లిష్‌ మీడియం కోసం పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు తదితర చర్యలు చేపడితే , ఆ అధికారులకు ఇబ్బందులు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. ఇక ఈ వ్యవహారంపై ముందుకెళితే ఆ ఖర్చును బాధ్యులైన అధికారుల నుంచే రాబడతామని తేల్చి చెప్పింది. పూర్తిగా ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా

తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా

తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. దాఖలు చేయడంలో విఫలమైతే స్వయంగా హాజరు కావాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. నిర్దిష్ట గడువులోపు ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే ఇంగ్లిష్‌ మీడియంపై కోర్టు ఉత్తర్వులు ఇస్తామని తేల్చి చెప్పింది. ఇక అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం విద్యా చట్ట సవరణ బిల్లు ఆమోదించి మండలికి పంపితే మండలి సైతం తెలుగు మీడియం ఉండాలని సవరణలు చేసి తిప్పి పంపింది.

Recommended Video

AP Assembly : CM Jagan Made Interesting Comments On The Amendment Of The Education Act !
అసెంబ్లీలో ఇంకా జరగని విద్యా చట్ట సవరణ .. ఏం జరగనుందో ?

అసెంబ్లీలో ఇంకా జరగని విద్యా చట్ట సవరణ .. ఏం జరగనుందో ?

ఇక మండలి సూచించిన సవరణలను తిరస్కరించిన ఏపీ అసెంబ్లీ మరోమారు అసెంబ్లీలో విద్యా చట్ట సవరణ బిల్లు ఆమోదించి మండలికి పంపుతున్నట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అంతే కాదు మళ్ళీ తిరస్కరించినా ఈ సారి చట్టం చేసి తీరతామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా ఈ వ్యవహారంపై కోర్టు సైతం సీరియస్ కావటంతో త్వరలో మరోమారు జరగనున్న విచారణలో కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి .

English summary
The High Court has once again angry over the AP government's decision. The High Court held that students have the right to choose their favorite medium. The High Court has made it clear to the AP government that students should not be forced under the name of English medium. The High Court has made key comments on the petition filed in the wake of the AP government's decision to enforce the English medium in the government schools of AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X